మెలోడి బ్రహ్మ మణిశర్మ చేతుల మీదుగా మాస్టర్ మహేంద్రన్ ‘వసుదేవ సుతం’ గ్లింప్స్ విడుదల

Melody Brahma Mani Sharma Unveiled Gripping Glimpse Of Vasudeva Sutham
Spread the love

ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఇస్తున్న చిత్రాలకు ఎక్కువ డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. గుడి చుట్టూ తిరిగే ఓ కథతో మాస్టర్ మహేంద్రన్ హీరోగా రాబోతోన్నాడు. బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల ‘వసుదేవ సుతం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజాగా ‘వసుదేవ సుతం’ సినిమా నుంచి మణిశర్మ చేతుల మీదగా అదిరిపోయే గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. విశ్వాన్ని చూపించడం.. అందులోంచి భూమి.. భూమీ మీదున్న ఓ గుడి.. ఆ గుడిలో ఉన్న పాము.. ఆ తరువాత హీరో ఎంట్రీ ఇలా అన్నీ అదిరిపోయాయి. గుడిలోని నిధి చుట్టూ ఈ కథ తిరిగేలా కనిపిస్తోంది. గ్లింప్స్‌తోనే సినిమా మీద అంచనాల్ని పెంచేశారు.
ఈ గ్లింప్స్‌ని మణిశర్మ రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక ఈ గ్లింప్స్‌కు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకంగా అనిపిస్తుంది. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, ఒరియా భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు.
తారాగణం : మాస్టర్ మహేంద్రన్, అంబికావాణి, జాన్ విజయ్, మిమ్‌గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఐశ్వర్యలక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్ తదితరులు
సాంకేతిక బృందం
నిర్మాత: దనలక్ష్మి బాదర్ల
రచయిత & దర్శకుడు: వైకుంఠ్ బోను
సంగీతం : మణిశర్మ
ఫోటోగ్రఫీ : జిజ్జు సన్నీ (పార్కింగ్ ఫేమ్)
గీత రచయిత : చైతన్య ప్రసాద్, శ్రీ హర్ష ఈమని
ఫైట్స్ : బింబిసారా రామకృష్ణ
పీఆర్వో : సాయి సతీష్

Related posts

Leave a Comment