నటులు కల్యాణ్ రామ్, విజయశాంతి కలిసి నటించిన చిత్రం ’అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. తల్లి కొడుకుల అనుబంధం, యాక్షన్ ప్రధానంగా సాగిన ఈ సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ సినిమా ఇటీవల రెంటల్ విధానంలో ప్రముఖ ఓటీటీ- వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చిన విషయం తెలిసిందే. రెంటల్ రావడంతో సినిమా చూద్దాం అనుకున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. అయితే తాజాగా ఈ సినిమాను రెంటల్ నుంచి తొలగించి ఫ్రీగా అందుబాటులోకి తీసుకోచ్చారు. ప్రైమ్ చందదారులు ఈ సినిమాను ఉచితంగా చూడవచ్చు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వైజయంతి (విజయశాంతి) అనే నిజాయితీగల ఐపీఎస్ అధికారి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు అర్జున్…
Category: FILM NEWS
‘శుభం’ లాంటి మంచి చిత్రాలని తీసి కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడమే ట్రాలాలా లక్ష్యం : సమంత
ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రముఖ నటి సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మీ, షాలినీ కొండెపూడి, వంశీధర్ వంటి వారు ప్రధాన పాత్రలుగా పోషించిన ఈ చిత్రాన్ని ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించారు. ఈ మూవీ మే 9వ తేదీన విడుదలై సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతూ రెండో వారంలోకి అడుగు పెట్టేసింది. ఈ క్రమంలో శుక్రవారం నాడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. నటి, నిర్మాత సమంత మాట్లాడుతూ .. ‘పది శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చానా? అన్నది ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. ‘శుభం’ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరితో నవ్వులు, సంతోషం కనిపిస్తోంది. ఇదే అసలైన…
‘Eleven’ Movie Review: Suspense Thriller : ‘ఎలెవన్’ మూవీ రివ్యూ : సస్పెన్స్ థ్రిల్లర్
నవీన్ చంద్ర హీరోగా నటించిన ‘ఎలెవన్’ చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. విడుదలైన ప్రచార చిత్రాలు కూడా ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా ఇది తెరకెక్కింది. కథ: విశాఖపట్నంలో వరుస హత్యలు సంచలనం సృష్టిస్తాయి. బాధితులను గుర్తించలేని స్థితిలో పోలీసులు తలలు పట్టుకుంటారు. ఈ కేసును డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ శశాంక్‌కు ప్రమాదం జరగడంతో, ఏసీపీ అరవింద్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. అరవింద్ రంగంలోకి దిగిన కూడా హత్యలు ఆగవు. హంతకుడితో పాటు హత్యకు గురైన వారి ఆనవాళ్లు కూడా దొరకవు. సవాలుగా మారిన ఈ కేసులో చివరకు ఓ చిన్న ఆధారం లభిస్తుంది. అయితే ఈ క్లూతో నేరస్థుడిని అరవింద్ ఎలా పట్టుకున్నాడు. నేరస్థుడికి ఎవరు సహాయం చేశారు? అసలు ఆ సైకో…
రామాయణంలో మండోదరిగా కాజల్ ?
టాలీవుడ్, బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత సత్యభామ అంటూ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంది. అయితే ఈ భామ తాజాగా మరో బంఫరాఫర్ కొట్టినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’లోకాజల్ ఛాన్స్ కొట్టేసినట్లు- తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో కాజల్ రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించనున్నారు. నితీష్ తివారి ’రామాయణ’ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి నటీనటుల ఎంపికపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ఖరారయ్యారు. ఇప్పుడు మండోదరి పాత్ర కోసం కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు…
‘హరిహరవీరమల్లు’ జూన్ 12న విడుదల
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. అన్ని అడ్డంకులను దాటుకొని జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన మొత్తం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రం పాన్‌ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పెద్దఎత్తున విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ దీని డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ‘హరి హర వీరమల్లు’ సినిమా గత కొన్నేళ్లుగా ఆలస్యమవుతూ వచ్చింది. హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా ఆగిపోవడంతో ఆలస్యం అయ్యింది. కానీ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో…
ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్‌లో ‘వార్-2’
బాలీవుడ్‌లో ఇదివరకు సంచలన విజయం అందుకున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘వార్‘కు సీక్వెల్‌గా రాబోతున్న చిత్రం ’వార్ 2’. 2019లో విడుదలైన మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు ఈ సీక్వెల్‌కి మరింత క్రేజీగా రూపొందించడానికి పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు. ఇది ఎన్టీఆర్‌కి బాలీవుడ్‌లో తొలి చిత్రం కావడంతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ’బ్రహ్మాస్త్ర’ వంటి విజువల్ వండర్‌ని తెరపైకి తీసుకొచ్చిన అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రానికి సరికొత్త మేకింగ్ కథాంశం ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందనేది అభిమానుల్లో పెద్ద క్యూరియాసిటీగా మారింది. కొన్ని లీకుల ప్రకారం, ఆయన నెగటివ్ షేడ్స్ ఉన్న…
ప్రముఖ కమెడియన్ ప్రవీణ్ ‘బకాసుర రెస్టారెంట్’ ట్రైలర్ విడుదల
పలు విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’, ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు మారుతి ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ”భకాసుర రెస్టారెంట్ త్వరలో మీ ముందుకు రాబోతుంది. మా ట్రైలర్ మారుతి గారి…
Trailer of Prominent Comedian Praveen’s ‘Bakasura Restaurant’ Released
Well-known actor and comedian Praveen, recognized for his performances in several successful films, is playing the lead role in the upcoming film Bakasura Restaurant. Viva Harsha appears in the title role. The film also features Krishna Bhagavan, Shining Phani, and KGF Garuda Ram in significant roles. Directed by S. J. Shiva in his directorial debut, the movie is produced by Lakshmayya Achari and Janardhan Achari under the banner of SJ Movies. With filming completed, the film is now ready for release. Described as a “hunger comedy entertainer,” the trailer of…
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ రచయిత బి.కె. ఈశ్వర్ కన్నుమూత
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ రచయిత బి. కె. ఈశ్వర్ (77) బుధవారం అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూశారు. విజయవాడకు చెందిన ఈశ్వర్ హైస్కూల్ విద్యార్థిగా ఉన్న సమయంలోనే సినిమా రంగంపై ఆసక్తిని పెంచుకున్నారు. తనకున్న అవగాహనతో మద్రాస్ కు చేసి విజయచిత్ర పత్రికలో రెండు దశాబ్దాల పాటు ఉప సంపాదకునిగా పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడే పూణె ఫిల్మ్ అండ్ టీవీ ఇన్ స్టిట్యూట్ లో ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ చేశారు. 1998 నుండి 2002 వరకూ ఈటీవీలో స్టోరీ డిపార్ట్ మెంట్ హెడ్ గా సేవలు అందించారు. ఈటీవీ, తేజ టీవీలకు పలు సీరియల్స్ రాశారు. ఆయన రాసిన సీరియల్స్ నంది అవార్డులను గెలుచుకున్నాయి. ‘గీతాంజలి’ ఫేమ్ గిరిజ నటించిన ‘హృదయాంజలి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘కాలేజ్ డేస్ టు మ్యారేజ్ డేస్’, ‘చీకటిలో నేను’,…
ఖమ్మం జిల్లా యజ్ఞనారాయణపురంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలోని యజ్ఞనారాయణపురంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తనయులు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ టి.డి.జనార్ధన్ ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, కేతినేని హరీశ్, శ్రీయాస్ శ్రీనివాస్, మందలపు సుధాకర్, పోటు సరస్వతి, రంజిత్, నవీన్ చంద్ర, ఇతర రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం మాట్లాడుతూ – ఈ రోజు ఎన్టీఆర్ అన్నగారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మన యజ్ఞనారాయణపురంలో ఇంత ఘనంగా జరగడం సంతోషంగా ఉంది. రామకృష్ణ గారు ఎన్టీఆర్ విగ్రహ…
