అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇది మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాణమవుతోన్న 6వ చిత్రం. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో ఉన్న సుందర ప్రదేశాల్లో ఇటీవలే మొదలైంది. నాగార్జున షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. అక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆయన పరవశించిపోయారు. ప్రేక్షకులతో ఆ ఆనందాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. “హాయ్.. ఇది రోహ్‌తంగ్ పాస్ (రోహ్‌తంగ్ కనుమ)లోని అందమైన ఉదయం. సముద్ర మట్టానికి మూడు వేల తొమ్మిది వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతం. అంటే పదమూడు వేల అడుగుల ఎత్తు. ఇది చాలా ప్రమాదకరమైన కనుమ. నవంబర్ నుంచి మే నెల వరకు దీన్ని మూసేస్తారు. ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చాం. ఈ సినిమా…
Category: FILM NEWS
విశ్వక్‌సేన్ రిలీజ్ చేసిన లింగోచ్చా టీజర్
కేరాఫ్ ఆఫ్ కంచెరపాలెం చిత్రంలో జోసెఫ్‌గా నటించి వీక్షకుల్ని ఆకట్టుకున్న కార్తీక్ రత్నం హీరోగా, సుప్యార్ధ్ సింగ్ హీరోయిన్‌గా ప్రముఖ నిర్మాత యాదగిరి రాజు శ్రీకళ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో, బ్లాక్ బాక్స్ స్టూడియోస్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం లింగోచ్చా (గేమ్ ఆఫ్ లవ్). ఈ చిత్రానికి ఆనంద్ బడా దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు హైదరాబాది కావటం వలన ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన లింగోచ్చా గేమ్ నేపథ్యంలో ఒక చక్కటి ప్రేమకథని రాసుకుని తెరకెక్కించారు. అంతే కాదు ఈ ప్రేమకథకి లింగోచ్చా అనే టైటిల్‌ని ఖరారు చేయటం విశేషం. ఈ టైటిల్ విన్న ప్రతి ఒక్కరూ సౌండింగ్ కొత్తగా వుందని అనటం యూనిట్‌కి కొత్త ఎనర్జీని ఇచ్చినట్లుగా చిత్రయూనిట్ పేర్కొన్నారు. ఇదే ఎనర్జీతో లింగోచ్చా టీజర్‌ని రెడీ చేశారు. యూత్ ఫుల్ మాస్ హీరోగా ఇటీవలే హ్యూజ్…
బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్.. గ్రేట్ రెస్పాన్స్
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ట్రీట్ ఇచ్చారు రాధేశ్యామ్ చిత్ర నిర్మాణ సంస్థలు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్.. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే కానుకగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ విక్రమాదిత్యగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అనే మోషన్ పోస్టర్ విడుదల చేశారు. చరిత్రలో నిలిచిపోయిన గొప్ప ప్రేమికులు దేవదాస్, పార్వతి.. లైలా మజ్ను ఫోటోల మీదుగా ఓ ట్రైన్ లో ఈ మోషన్ పోస్టర్ సాగుతుంది. చివరగా ప్రభాస్, పూజా హెగ్డే జోడి కనిపిస్తుంది. ఈ ప్రేమకథ కూడా అంత గొప్పగా ఉంటుందని…
శ్రీదివ్య రిలీజ్ చేసిన ‘అర్ధ శతాబ్దం’ పుష్ప లుక్
కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో రిషిత శ్రీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘అర్ద శతాబ్ధం’. అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. రవీంద్ర పుల్లే దర్శకుడు. చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపులో ఉంది. ఇటీవల రానా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లింది. తాజాగా బతుకమ్మ సంబురాల సందర్భంగా ‘పుష్ప’ పాత్ర లుక్‌ని ప్రముఖ నటి శ్రీదివ్య లాంచ్ చేశారు. ఈ లుక్‌కి అన్ని వర్గాల నుంచి అద్భుత స్పందన వస్తోంది. పుష్ప పాత్రలో కృష్ణ ప్రియ నటన ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్ రత్నం ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నారప్పలో వెంకటేష్ కుమారుడిగా నటిస్తున్నారు. అలాగే అర్థ శతాబ్దం సినిమాలో…
సూర్య సినిమా రిలీజ్‌కు బ్రేక్.. కారణమిదే
వివిధ పర్మిషన్లు రావాల్సి ఉన్నందున ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం విడుదలలో జాప్యం జరుగుతోందని హీరో సూర్య తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఓ లెటర్ పోస్ట్ చేశారు. వాస్తవానికి ఆ చిత్రాన్ని అక్టోబర్ 30న విడుదల చేయనున్నట్లు ఇదివరకు ప్రకటించారు. ‘ఆకాశం నీ హద్దురా’ (సూరారై పొట్రు) చిత్రం విడుదలలో జాప్యం జరగడానికి కారణాలను, తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను హృదయాన్ని స్పృశించేలా తన లెటర్‌లో ఆయన వెల్లడించారు. ఒక లెటర్ ద్వారా తన ఆలోచనలను పంచుకోవడం తన దినచర్య కాదనీ, కానీ ఇప్పుడు తన అభిమానుల ముందు ఓపెన్ హార్ట్‌తో, పారదర్శక మనసుతో నిలబడాల్సిన ఒక పరిస్థితి తలెత్తిందని ఆయన చెప్పారు. ఎందుకంటే తను ఇప్పుడున్న స్థాయికి రావడంలో అన్నివేళలా తనకు అండగా నిలిచిందని అభిమానులేనని సూర్య అన్నారు. ‘ఆకాశం…
యంగ్ రెబల్ స్టార్.. హీరో అంటే ఇలా ఉండాలి
రెబల్‌స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్‌లోనే కాదు ఎంటైర్ సినీ ఇండస్ట్రీలో మారుమోగుతోంది. టాలీవుడ్‌లో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్ ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఈ ప్రయాణానికి ముందు తన మార్కును క్రియేట్ చేసుకోవడానికి ప్రభాస్ ఎంతో ఓపికగా కష్టపడ్డారు. తొలి చిత్రం ‘ఈశ్వర్’తో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తర్వాత రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్‌నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, రెబల్, మిర్చి వంటి చిత్రాలతో వైవిధ్యతను చూపుతూ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటూ హీరో అంటే ఇలాగే ఉండాలనే విధంగా అన్నీ వర్గాల ప్రేక్షకుల హృదయాల్లో స్టార్ హీరోగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రభాస్.రేంజ్ పెంచిన బాహుబలిప్రభాస్ కెరీర్‌ను చూస్తే బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అని…
మోహన్‌బాబు.. ‘సన్ ఆఫ్ ఇండియా’
కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్‌బాబు చాలా రోజుల తర్వాత హీరోగా నటిస్తోన్న దేశభక్తి కథా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని మోహన్‌బాబు నివాసంలో శుక్రవారం చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు విరానికా మంచు, ఐరా, అవ్రమ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, లక్ష్మీ మంచు, విద్యానిర్వాణ సంయుక్తంగా క్లాప్ నిచ్చారు. విష్ణు మంచు గౌరవ దర్శకత్వం వహించారు. అరియానా, వివియానా సంయుక్తంగా స్క్రిప్టును డైరెక్షనల్ టీమ్‌కు అందించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సైతం ఈరోజే మొదలైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్టర్‌కు ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత…
‘రామరాజు ఫర్ భీమ్’.. టీజర్ అదిరింది
ఎంటైర్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్(రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రం నుండి ‘రామరాజు ఫర్ భీమ్’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ 119వ జయంతి(అక్టోబర్ 22) సందర్భంగా ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్‌ను మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ విడుదల చేశారు. కొమురం భీమ్ పాత్ర గురించి అల్లూరి సీతారామరాజు వెర్షన్‌లో సాగుతున్న ఈ టీజర్‌లో…. ”వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి..నిలబడితే రాజ్యాలు సాగిలపడతాయి..వాడు పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండవాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ..నా తమ్ముడు, గోండు బెబ్బులి కొమురం భీమ్” అంటూ రామ్‌చరణ్ చెబుతున్న డైలాగ్స్, ఎన్టీర్ నటనకు వరల్డ్‌వైడ్‌గా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో…
‘రాధేశ్యామ్’లో విక్రమాదిత్యగా ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇస్తూ, రాధేశ్యామ్ చిత్ర నిర్మాణ సంస్థలు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రంలో రెబల్ స్టార్ పోషిస్తున్న విక్రమాధిత్య రోల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అనే మోషన్ పోస్టర్ ని విడుదల చేయబోతున్న చిత్ర బృంతం కొంచెం ముందుగానే ప్రభాస్ కి అడ్వాన్స్ హ్యపీ బర్త్ డే విషెస్ చెబుతూ ఈ లుక్ ని విడుదల చేయడం విశేషం. ప్రతి సినిమాకి తన హ్యాండ్ సమ్ లుక్స్, స్టైలిష్ మేకోవర్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసే రెబల్ స్టార్ ప్రభాస్, ఇప్పుడు రాధేశ్యామ్ లో కూడా అల్ట్రా స్టైలిష్ గా…
‘తుగ్లక్ దర్బార్’ నుండి తప్పుకున్న హీరోయిన్
టాలెంటెడ్ బ్యూటీ అదితి రావు హైదరి ‘విజయ్ సేతుపతి’ తుగ్లక్ దర్బార్ సినిమాలో తానూ నటించట్లేదు అని తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమతో సహా ప్రపంచం సినీ లోకమే గత 6-8 నెలలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దశలవారీగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్స్ ను మొదలుపెట్టారు. పని లేక నటీనటులు ఎవ్వరూ వేచి ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. అలాగే ప్రారంభించని ప్రాజెక్ట్ లు కూడా ఏ మాత్రం నా వల్ల ఆలస్యం కాకూడదనుకుంటున్నాను. అందుకే నేను పని చేయాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతం కొన్ని కారణాలను దృష్టిలో ఉంచుకుని, నిర్మాత, సెవెన్ స్క్రీన్…
