“సైకో వర్మ” (వీడు తేడా) చిత్రం టైటిల్ కు సెన్సార్ అభ్యంతరం చెప్పడంతో ఆ చిత్ర దర్శకుడు నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీధర్ పొత్తూరి సమర్పణలో అనురాగ్ కంచర్ల నిర్మాణంలో నిర్మాత నట్టి కరుణ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రం టైటిల్ కు సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో నట్టికుమార్ ఆగ్రహం వెలిబుచ్చారు. సెన్సార్ ద్వంద విధానాలకు ఇదో ఉదాహరణ అని ఆయన ఆరోపించారు. సైకో వర్మ టైటిల్ లో సైకో అన్న పదాన్ని తొలగించమని, లేకుంటే వేరే టైటిల్ పెట్టుకోమని సెన్సార్ వారు చెప్పారని ఆయన వెల్లడించారు. గతంలో సైకో పేరుతో కొన్ని…
Category: FILM NEWS
‘మల్లేశం’ నిర్మాతల మరో సినిమా
గతంలో మల్లేశం లాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాతలు ఇప్పుడు కొత్తగా మరో సినిమాతో మన ముందుకు వస్తున్నారు. పక-రివర్ ఆఫ్ బ్లడ్ అనే ఈ కొత్త సినిమా మలయాళం సినిమాగా రూపొందించబడింది. మల్లేశం సినిమాకి సౌండ్ డిజైనర్ గా పనిచేసిన నితిన్ లూకోస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి ప్రఖ్యాత దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఒక నిర్మాత కావడం మరొక విశేషం. ఎన్నో ఏళ్లగా రెండు కుటుంబాల మధ్య రగులుతున్న పగ, ద్వేషాల నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక నది ప్రముఖ పాత్రపోషిస్తుంది. వారి పగకు ఎరుపెక్కిన ఆ నదిని శాంతింపచేసే ప్రేమ కథగా కూడా ఈ సినిమాని చూడొచ్చని దర్శక నిర్మాతలు తెలియచేశారు.ఉత్తర కేరళలోని వయానాడ్ ప్రాంతంలోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరింపబడిన ఈ సినిమాలో బాసిల్ పాలోస్, వినీత కోషీ.,…
The producers of acclaimed Telugu film Mallesham are back with another interesting feature film titled Paka – The River of Blood
The producers of acclaimed Telugu film Mallesham are back with another interesting feature film titled Paka – The River of Blood. Paka is a Malayalam language feature film directed by Nithin Lukose, who was the sound designer for Mallesham.Produced by Anurag Kashyap and Raj Rachakonda, PAKA is a tale of a river that swells with the blood of two feuding families and a young couple that tries to overcome this hatred with their love.The film set in Wayanad of North Kerala, features an ensemble cast including, Basil Paulose (Johnny), Vinitha…
టీ.ఎల్.సి చర్చిలో అల్లి జయదీప్ కెన్ని ప్రధమ వర్ధంతి
అల్లి జయప్రసాద్ రావు – మధురవేణిల ఏకైక కుమారుడు అల్లి జయదీప్ కెన్ని ప్రధమ వర్ధంతి బుధవారం హైదరాబాద్ ఉప్పల్ లోని టీ.ఎల్.సి చర్చిలో జరిగిగింది. బంధుమిత్రులు-సన్నిహితులు-స్నేహితుల మధ్య జరిగిన ఈ కార్యక్రమాన్ని టీ.ఎల్.సి చర్చి పాస్టర్ రెవ. ప్రభాకర్ పాల్ నిర్వహించారు. 23-12-1985లో జన్మించిన అల్లి జయదీప్ కెన్ని బ్రెయిన్ లో తలెత్తిన సమస్యతో 28-07-2020లో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈసందర్బంగా టీ.ఎల్.సి చర్చి పాస్టర్ రెవ. ప్రభాకర్ పాల్ మాట్లాడుతూ -”కెన్నిగత ఏడాది 2020లో ఇదే రోజు దేవుని పిలుపునందుకొని అతడి తల్లిదండ్రులను వదిలి దేవుని సన్నిధికి చేరుకున్నాడు. ఈ లోకంలో ఎంతకాలం జీవించినప్పటికీ ఒక దిన ఉంటుంది. ముందు వెనకాల ప్రయాణం. అల్లి జయదీప్ కెన్నితన తల్లిదండ్రులకు మంచి కుమారుడిగా, స్నేహితులకు బెస్ట్ ఫ్రెండ్ గా , సంఘంలో ఒక…
భారత దేశంలో పేద వాడికి వినోదం లేదు: ఓటిటి ప్లాట్ ఫోమ్స్ పై పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సన్సేషనల్ కామెంట్స్
విజయవాడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ నారాయణ మూర్తి ఇటీవల ఓ టి టి లో రిలీజ్ అయిన నారప్ప సినిమా తెలుగు రాష్ట్రాలలో కేవలం 25 శాతం మంది మాత్రమే చూసారు. కానీ మిగతా 75 శాతం మంది చూడలేకపోయారు. మధ్య తరగతి బడుగు వర్గాల ఇళ్ళల్లో ఓ టి టి లేదు.. మరి వాళ్ల కెప్పుడు ఇస్తారు వినోదం. సినిమా థియేటర్ లో సినిమా చూడడం ఒక పండుగ . థియేటర్ అనుభూతే వేరురెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా విజ్ఞపివెంటనే సినిమా థియేటర్స్ తెరుచుకునే విధంగా చూడాలని కోరుతున్నానుకరోనా తో ఫైట్ చెయ్యాల్సిందే అందరూ పేద వాడికి వున్న ఒకే ఒక వినోదం థియేటర్సినిమా బతకాలి థియేటర్స్ బతకాలిసినీ పరిశ్రమ పెద్దలు కూడా సినిమా థియేటర్ ఓపెన్ అయేటట్టు చూడాలిమనిషి వున్నంత…
ప్రకాష్ రాజ్ చేతుల మీదుగా ‘భగత్ సింగ్ నగర్’ టీజర్ విడుదల
తనపై వేసిన ఏ.వి లో నా పర్మిషన్ లేకుండా “మా అసోసియేషన్” కు పోటీ చేస్తున్న క్లిప్పింగ్ ను ప్రదర్శించినందుకు “భగత్ సింగ్ నగర్” చిత్ర దర్శకుడిపై అసహనం వ్యక్తం చేసిన… నటుడు ప్రకాష్ రాజ్ గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ , ధృవిక హీరో,హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం “భగత్ సింగ్ నగర్” . తెలుగు మరియు తమిళ బాషలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా టీజర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ చిత్ర టీజర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో,దర్శకుడు వీరభద్రం , దర్శకుడు చిన్ని కృష్ణ,…
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభును అభినందించిన ‘నరసింహపురం’ చిత్ర బృందం
ఈ అభినందన మా కార్యవర్గ సభ్యులందరికీ: ప్రభు జులై 30న విడుదలవుతున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’ చిత్ర బృందం ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ప్రభును అభినందించింది. ఈ చిత్రం ప్రివ్యూ సందర్భంగా ప్రభును శాలువాతో సత్కరించారు. ఎంతో ఫ్యాషన్ తో.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రూపొందిన ‘నరసింహపురం’ ఘన విజయం సాధించాలని ప్రభు ఆకాంక్షించారు. ఈ అభినందన తమ కొత్త కార్యవర్గం అందరికీ చెందుతుందని పేర్కొన్నారు. మూడోసారి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రభు సారధ్యంలోని కొత్త కార్యవర్గం మరింత మంచి పేరు తెచ్చుకోవాలని చిత్ర కథానాయకుడు నందకిషోర్, దర్శకుడు శ్రీరాజ్ బళ్లా, నిర్మాత ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకుడు ఫ్రాంక్లిన్ సుకుమార్ కోరుకున్నారు. జులై 30 న ‘నరసింహపురం’ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుందని తెలిపారు. కల్యాణ మాధవి,…
ఘనంగా ‘నరసింహపురం’ విడుదల వేడుక: 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్
గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై.. పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాలతో కలిసి ‘శ్రీరాజ్ బళ్లా’ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 30న విడుదలవుతున్న సందర్భంగా ప్రి-రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష ఈ చిత్రంలో హీరో చెల్లెలు పాత్రలో నటించారు.గ్రాండ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ ను తలపించేలా జరిగిన ఈ వేడుకలో ఎమ్.ఎల్.ఎ లక్ష్మారెడ్డి, ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్, ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నటుడు సమీర్, ఊర్వశి ఓటిటి సిఇఓ తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర కథానాయకుడు నందు, దర్శకుడు శ్రీరాజ్…
మధ్యప్రదేశ్ పర్యాటక సంస్థ సహకారం మరువలేనిది
‘తప్పించుకోలేరు’ దర్శకనిర్మాత ‘ఆర్.వి.జి’: ఆగస్టు 13 విడుదల ఆర్.వి.జి మూవీజ్- ఎస్.వి.ఎల్.ఎంట్రప్రైజస్ పతాకాలపై రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)-తలారి వినోద్ కుమార్ ముదిరాజ్- శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ “తప్పించుకోలేరు”. “కొత్తకథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం” వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తాను ఘనంగా చాటుకున్న రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) స్వీయ నిర్మాణంలో తాజాగా రూపొందించిన ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 13 విడుదలకు సిద్దమవుతోంది. రవిశంకర్ ఓంకాళి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆదర్శ్, హరీష్, ట్వింకిల్ అగర్వాల్, సాయిశ్వేత, ఆకెళ్ల, ఫహీం ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ గ్యాస్ సంఘటన స్పూర్తితో తెరకెక్కింది. మధ్యప్రదేశ్ పర్యాటక సంస్థ సౌజన్యంతో చాలా భాగం భోపాల్ మరియు పరిసర…
ఘనంగా ‘అల్లుడు బంగారం’ షూటింగ్ ప్రారంభం
శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కుమార్, శ్రీ లక్ష్మీ హీరోహీరోయిన్లుగా.. వెంకట నరసింహ రాజ్ దర్శకత్వంలో లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తున్న ‘అల్లుడు బంగారం’ చిత్రం పూజా కార్యక్రమం హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నటుడు సుమన్ హీరోహీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా. కమెడియన్ పృథ్వి కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సముద్ర తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం నటుడు సుమన్ మాట్లాడుతూ.. అల్లుడు బంగారం మూవీ ఇది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్.. కరోనా స్టార్ట్ కాకముందు అంటే రెండు సంవత్సరాల క్రితమే దర్శక,నిర్మాతలు నాకు ఈ కథ చెప్పారు. వీరు చెప్పిన కథ మాకు ఎంతో నచ్చింది. రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ గా ఉన్న…
