ఈ ఏడాది ‘నాంది’తో సూపర్ డూపర్ హిట్ కొట్టి, విలక్షణ నటనతో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న అల్లరి నరేశ్ హీరోగా… ఇదే ఏడాది కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత `తిమ్మరుసు`తో సూపర్‌హిట్‌ను సాధించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం `సభకు నమస్కారం`. సతీశ్ మల్లంపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి మహేశ్ కోనేరు నిర్మాత. గురువారం ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నరేశ్ కుమార్తె అయాన క్లాప్ కొట్టగా, పోకూరి బాబూరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. `నాంది` డైరెక్టర్ విజయ్ కనకమేడల ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అబ్బూరి రవి, అమ్మిరాజు, సుధీర్ స్క్రిప్ట్‌ను చిత్ర దర్శకుడు సతీశ్ మల్లంపాటికి అందించారు. నరేశ్ 58వ చిత్రమిది. ఆయన పుట్టినరోజున విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అమేజింగ్ రెస్పాన్స్…
Category: FILM NEWS
డెక్కన్ (హైద్రాబాద్ హిందీ) ఫిల్మ్’హౌలా’ హంగామా మొదలైంది..
డెక్కన్ సినిమాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి…విరివిగా రాయితీలివ్వాలి: ముఖ్య అతిధి సయ్యద్ హుస్సేన్
ఆగస్టు 14న ఆర్ నారాయణమూర్తి ‘రైతన్న’ విడుదల
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన చిత్రం రైతన్న..ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది.ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ఆర్ నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ; ఆగస్టు 14న రైతన్న సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చెయ్యాలి అని రైతన్న సినిమా తీశాను.ఈ చిత్రం ద్వారా చెప్పే విషయం ఏమిటంటే నేటి రైతు పరిస్థితి గురించి. భారత దేశంలో సామాజికంగా వెనకబడిన కులం ఏదైనా వుంది అంటే అది రైతు కుటుంబమే. రైతే దేశానికి వెన్నుముక. రైతే రాజు…ఆ నానుడి ఏమైంది. ఆ రైతు ఎక్కడున్నాడు.అన్నం పెట్టే అన్నదాత ఏ పొజిషన్ లో వున్నాడు ఈరోజు?.చాలా బాధాకరంగా వుంది రైతు పరిస్థితి.ఎందుకంటే రైతు తను పండించే…
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అభివృద్దికి పూర్తి సహకారాన్ని అందిస్తా : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈరోజు హైదరాబాద్ లోని తన ఆఫీస్ లో.. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గంతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన జర్నలిస్ట్ ప్రభు, ఉపాధ్యక్షుడు నాగేంద్రకుమార్.. ఇతర కార్యవర్గ సభ్యులను మోహన్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. సినిమా జర్నలిస్టులతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని.. తను నటుడుగా ఈరోజు ఈ స్ధాయిలో ఉన్నానంటే.. దానికి సినిమా జర్నలిస్టులు అందించిన ప్రొత్సాహం కూడా ఓ కారణమని మెహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు మాట్లాడుతూ.. నేను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి జర్నలిస్ట్ ప్రభుతో అనుబంధం ఉంది. ప్రభు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడుగా, అలాగే నాగేంద్రకుమార్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికవ్వడం చాలా సంతోషంగా ఉంది.…
యండమూరి వీరేంద్రనాద్ దర్శకత్వంలో హీరోగా బెనర్జీ!
సీనియర్ నటుడిగా ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన ప్రముఖ నటుడు బెనర్జీ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి “అతడు, ఆమె – ప్రియుడు” అనే టైటిల్ ఖరారు చేసారు. యండమూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అయన ఒక ఆస్ట్రోనమి ప్రొఫసర్ గా నటిస్తున్నాడు. ఇదొక బ్లాక్ హ్యూమర్ థ్రిల్లర్ సస్పెన్స్ సినిమా. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్య క్రమాలు ప్రారంభమయ్యయి.. ఈ సినిమా గురించి బెనర్జీ స్పందిస్తూ .. “…ఇన్నాళ్లు నటుడిగా పలు భిన్నమైన పాత్రల్లో నటించిన నేను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవడం ఆనందంగా ఉంది. భిన్నమైన కథతో యండమూరి వీరేంద్రనాథ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది ” అని, త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ…
Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Blaster Is Tollywood’s Most Watched Teaser In The First 24 Hours Of Release
The makers of Superstar Mahesh Babu’s highly anticipated flick Sarkaru Vaari Paata directed by the Parasuram have released ‘Sarkaru Vaari Paata Blaster’ on August 9th as Mahesh Babu’s Birthday Special.The Blaster looks kick-ass and mindblowing skyrocketing the hype around the film. It has struck chord with the fans and common audience alike and as a result, it has emerged as Telugu film industry’s most watched teasers in the first 24 hours of its release.The teaser has recorded 25.7 Million views and over 754K Likes in the 24 hours and is…
‘పాగల్’ ప్రేమకథ మాత్రమే కాదు.. ప్రేమను గురించి చెప్పే చిత్రం: ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హీరో విష్వక్ సేన్
విష్వక్‌సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం పాగల్. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. సినిమా ఆగస్ట్ 14న విడుదలవుతుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను విష్వక్ సేన్ తండ్రి, ఫలక్‌నుమాదాస్ నిర్మాత రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా…హీరో విష్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘గత ఏడాది ‘హిట్ సినిమా తర్వాత ప్రేక్షకులను కలుసుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు ‘పాగల్’ సినిమాతో మీ ముందుకొస్తున్నాను. అందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం. చాలా రిస్కీ టైమ్.. నా సినిమా కంటే ముందు పెద్ద సినిమా ఏదీ రాలేదు, టిక్కెట్టు రేట్స్ విషయంలోనూ, ఇలా చాలా సమస్యలున్నాయి. ఇలాంటి సమయంలో రిస్క్ చేసి సినిమాను రిలీజ్ చేస్తున్నాం. నేను, బెక్కెం వేణుగోపాల్‌గారు నమ్మి ఈ…
‘బొమ్మల కొలువు’ ట్రైలర్ విడుదల
సూపర్‌స్టార్ రజినీకాంత్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సెన్స్టేషనల్ మ్యూజిక్ కంపోజర్ అనిరుద్ రవిచంద్రన్ కజిన్ రిషికేశ్ . ..‘రఘువరన్ బి.టెక్’తో సినీ ఇండస్ట్రీ లో అరంగేట్రం చేశారు. ఆ సినిమాలో ధనుశ్ తమ్ముడి గా నటించిన రిషికేశ్ ఇప్పుడు ‘బొమ్మల కొలువు’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. రిషికేశ్, ప్రియాంక శర్మ, మాళవికా సతీశన్ హీరో హీరోయిన్లుగా సుబ్బు వేదుల దర్శకత్వంలో పృథ్వీ క్రియేషన్స్, కిక్కాస్ స్టోరీ టెల్లర్ పతాకాలపై ఎ.వి.ఆర్.స్వామి నిర్మిస్తోన్న చిత్రం ‘బొమ్మల కొలువు’. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి కోన వెంకట్, బి.వి.ఎస్.రవి ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా…హీరో రిషికేశ్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు సుబ్బుగారు డిఫరెంట్‌గా తెరకెక్కించారు. నాపై నమ్మకంతో రుద్ర అనే పాత్రను నాకు ఇచ్చారు.…
‘ సైకో వర్మ’ (వీడు తేడా) మోషన్ పోస్టర్ విడుదల
‘సైకో వర్మ’ (వీడు తేడా) చిత్రం మోషన్ పోస్టర్ విడుదల.. విడుదలైన కొద్ది గంటల్లోనే దీనికి విశేషమైన స్పందన లభించింది. నట్టిక్రాంతి హీరోగా నటించిన ఈ చిత్రంలో *హీరోయిన్లుగా సుపూర్ణ మలాకర్, ముస్కాన్ సందడి చేస్తున్నారు. నట్టికుమార్ దర్శకత్వం వహించారు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి నట్టి లక్ష్మి, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో అనురాగ్ కంచర్ల నిర్మాణంలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు. ఈ సందర్భంగా నిర్మాత నట్టి కరుణ మాట్లాడుతూ, ఓ సాఫ్ట్ వేర్ కుర్రాడి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతూ…యదార్థ సంఘటనల ప్రేరణతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంటుందని అన్నారు. హీరో నట్టి క్రాంతి తన పాత్రకు ప్రాణం పోశాడని, పాటలు కూడా అలరిస్తాయని చెప్పారు.…
స్క్రిప్టు నచ్చితేనే సినిమా ఒప్పుకుంటా : హీరోయిన్ ప్రియాంక జవాల్కర్
టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్. ఇటీవల స్పీడ్ పెంచిన ఈ నాయిక తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది. ఈ రెండు చిత్రాల్లో ప్రియాంక అందం, నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో పాత్రికేయులతో ముచ్చటించింది ప్రియాంక. ఆమె ఇంటర్వ్యూ హైలైట్స్ చూస్తే.. నేను కొంత గ్యాప్ తరువాత నటించిన తిమ్మరుసు హిట్ అయ్యిందని అందరూ అన్నారు. ఎస్ఆర్ కల్యాణమండపం సెకండ్ వేవ్ తరువాత ఫస్ట్ హిట్ అంటున్నారు. థియేటర్ కి ప్రేక్షకులు వస్తారా రారా అనే ఒక డౌట్ ఉండేది, కానీ ఇప్పుడు థియేటర్స్ కు ఆడియన్స్ విపరీతంగా వస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ జాగ్రత్తలు పాటిస్తూనే థియేటర్స్ కి వస్తున్నారు. తిమ్మరుసు విడుదల తరువాత గ్లామర్ పై కొంత కేర్…
