మెగా మేకర్ ఎం.ఎస్ రాజు న్యూ ఏజ్ ఫిల్మ్ ‘7 డేస్ 6 నైట్స్’ టీం క్లిష్ట పరిస్థితుల మధ్య రికార్డు సమయంలో షూట్ పూర్తిచేసేసారు.అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీంతో, 4 కామెరాలతో గోవా, మంగళూరు మరియు ఉడుపి లో చివరి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎం. ఎస్. రాజు టీం, నిర్మాణంతర కార్యక్రమాలు, డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుని అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ, “అనుకున్న దానికంటే త్వరగా అద్భుతంగా చిత్రం పూర్తయింది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా పట్టుదల, క్రమశిక్షణ తో పని చేసిన నా టీం కి చాలా థాంక్స్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన మా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కి ఈ చిత్రంతో మళ్ళీ పూర్వ వైభవం…
Category: FILM NEWS
సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా గోపీచంద్ ‘సీటీమార్’
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా …చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ ‘‘ఎగ్రెసివ్ స్టార్, యాక్షన్ హీరో అయిన గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా మా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’ను సెప్టెంబర్ 10న భారీ ఎత్తున విడుదల…
‘డియర్ మేఘ’ నా డ్రీమ్ మూవీ : హీరోయిన్ మేఘా ఆకాష్
అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ మేఘా ఆకాష్. ఆమె కొత్త సినిమా ”డియర్ మేఘ” సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా నటించారు. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందించారు. భావోద్వేగ ప్రేమ కథగా తెరకెక్కిన ”డియర్ మేఘ”. సినిమా ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర నాయిక మేఘా ఆకాష్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ…. రీసెంట్ గా రాజ రాజ చోర చిత్రంతో మీ ముందుకొచ్చాను. ఇప్పుడు నా మరో సినిమా ”డియర్ మేఘ” విడుదలకు సిద్ధమవడం చాలా సంతోషంగా ఉంది, అదే టైమ్ లో…
‘పెళ్లికూతురు పార్టీ’ ట్రైలర్ విడుదల
అనీషా దామ, ప్రిన్స్, భావన వజపండల్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘పెళ్లికూతురు పార్టీ’. పృథ్వీ క్రియేషన్స్ బ్యానర్‌పై అపర్ణ మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎ.వి.ఆర్.స్వామి నిర్మాత. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. పాన్ ఇండియా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా… స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘‘‘పెళ్లి కూతురు పార్టీ’ అని పిలిస్తే.. ఒక్కడేదో పెళ్లి వాతావరణం కనిపిస్తుందేమోనని అనుకున్నాను. కానీ అలాంటి వాతావరణం కనిపించలేదు. పోనీ పార్టీ ఏమైనా ఇస్తారేమో అనుకుంటే అదీ లేదు. అయితే మంచి ట్రైలర్, సాంగ్స్‌తో మెప్పించారు. చాలా బావున్నాయి. సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. డైరెక్టర్ అపర్ణ మల్లాది మాట్లాడుతూ ‘‘విజయేంద్ర ప్రసాద్‌గారు నాకు మెంటర్, గురు, ఫ్రెండ్.. ఆయన ఈ కార్యక్రమానికి…
‘రాజరాజ చోర’ సక్సెస్ మీట్
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్. హిసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న సినిమా విడుదలైన ీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి, నటుడు రవిబాబు, హీరోయిన్స్ మేఘా ఆకాశ్, సునైన, నైజాం, ఆంధ్ర, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు.హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘‘సినిమా అనుకున్నప్పుడు కుమార్ చౌదరిగారి దగ్గరకు వెళ్లాం. అలా పీపుల్ ఫ్యాక్టరీకి వెళ్లి వివేక్‌గారిని కలిశాం. తర్వాత అభిషేక్ అగర్వాల్‌గారిని కలిశాం. వర్క్ స్టార్ట్ అయిన తర్వాత టీమ్‌కు…
సెప్టెంబర్ 17న డిస్నీ హాట్‌స్టార్‌లో హీరో నితిన్ ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్
హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే సంగతి తెలిసిందే. ప్రముఖ డిజిటల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో సెప్టెంబర్ 17న ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు డిస్నీహాట్ స్టార్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హీరో నితిన్ ల్యాండ్ మార్క్‌గా నటిస్తోన్న 30వ చిత్రమిది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో హీరో నితిన్ నల్లటి కళ్లద్దాలు ధరించి చేతిలో కర్ర పట్టుకుని నడుస్తున్నాడు. ఇక సినిమాలో నటిస్తోన్న ప్రధాన తారాగణమైన నభా నటేశ్, తమన్నా భాటియా, వి.కె.నరేశ్, జిస్సుసేన్ గుప్తా, తదితరులు పోస్టర్‌లో కనిపిస్తున్నారు.బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిలర్‌గా రూపొందుతున్న మాస్ట్రో చిత్రం కోసం డైరెక్టర్ మేర్లపాక గాంధీ, హీరోయిన్స్ నభా నటేశ్, తమన్నాలతో కలిసి తొలిసారి…
ధ్వని ఫస్ట్ లుక్ విడుదల
వైవిధ్యమైన కథా చిత్రాలను, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్ కథానాయకుడు వినయ్ పనిగ్రహి ధ్వని అనే డిఫరెంట్ మూవీతో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారుగురువారం ధ్వని ఫస్ట్‌లుక్ ను హీరో నవదీప్ గారు విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా హీరో నవదీప్ మాట్లాడడు…డైరెక్టర్ దుర్గ నాకు రెండు సంవత్సరాలుగా తెలుసు, ఆయనలో చాలా కృషి మరియు పట్టుదల ఉంది అని ఆయన చెప్పరు… ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అని ఆయన పేర్కొన్నారు.ఫస్ట్‌లుక్‌ను గమనిస్తే సీరియస్‌గా తలకి కట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నాడు..సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో సౌండ్ కి సంబందించిన వ్యాధితో బాధపడే ఒక వ్యక్తి జీవితం లో జరిగిన సంఘటనలు, ఆ సంఘటనల నుండి ఎలా బయటపడ్డాడు.. అనేది మూవీ కాన్సెప్ట్ అని చిత్ర బృదం తెలిపింది.లుక్…
మిస్ , మిసెస్ ఇండియా ఫినాలే విన్నర్ గా సంజన
ఇండి రాయల్ సంస్థ ఆధ్వర్యంలో ఆరో ఎడిషన్ లో మిస్ & మిసెస్ ఇండియా – 2021 గ్రాండ్ ఫినాలే కాంపిటీషన్ బంజారాహిల్స్ లో జరిగింది, ఈ పోటీలో దేశ వ్యాప్తంగా 42 మంది ఫైనలిస్ట్ లను ఎంపిక చేసి వారితో ఫైనల్ కాంపిటీషన్ కండెక్ట్ చేశారు. ఇందులో హైదరాబాదీ యువతి సంజన విన్నర్ గా నిలిచి మిస్ ఇండియా 2021 కిరిటాన్ని ధరించారు.పది రౌండ్ల చోప్పున కొనసాగిన ఈ పోటీల్లో మిస్ ఇండియా కిరీటం కోసం 10 మంది, మిసెస్ ఇండియా కిరీటం కోసం 17 మంది మిసెస్ ఇండియా క్లాసిక్ కిరీటం కోసం 15 మంది పోటీ పడ్డారు.
బప్పీలహరి సంగీతంతో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు భారీ చిత్రం
డిస్కోకింగ్ బప్పీలహరి వయసు మీద పడుతున్నా తన ప్రత్యేక డిస్కో వినసొంపు భాణీలతో తన సంగీతానికి మరింత పదును పెడుతూ సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నారు.చదలవాడ తిరుపతిరావు ఆయన సోదరుడు చదలవాడ శ్రీనివాస రావు తాజాగా నిర్మించబోయే ఓ భారీ యాక్షన్ చిత్రానికి బప్పీలహరి సంగీతం సమకూర్చబోతున్నట్లుఆ చిత్ర దర్శకుడు జి. రవికుమార్ మీడియాకు తెలియజేశారు.చదలవాడ బ్రదర్స్ నిర్మించిన ” రోజ్ గార్డెన్” చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న నితిన్ నాష్ ఈ నూతన చిత్రంలో కూడా హీరో గా నటించనున్నారు.“రోజ్ గార్డెన్” సంగీతంతో కూడిన ప్రేమ కథాచిత్రం అయినప్పటికీ ఆ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల్లో సాహసవంతంగా ఫైట్లు అదరగొట్టిన హీరో నితిన్ నాష్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ…ఈ కుర్రాడు యాక్షన్ హీరోగా రాణించగలడనే పూర్తి నమ్మకంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ భారీ యాక్షన్…
సూపర్ స్టార్ కృష్ణ జీవితం .. అత్యంత స్ఫూర్తిదాయకం!
-గజల్ మ్యాస్ట్రో డా.గజల్ శ్రీనివాస్ సుాపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ జీవితం స్ఫుార్తిదాయక కావ్యమని గజల్ మాష్ట్రో డా. గజల్ శ్రీనివాస్ అన్నారు. సుాపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రం రిలీజై 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు కృష్ణ- మహేష్ ఫాన్స్ ఆధ్వర్యంలో స్ధానిక ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు సినిమారంగ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసారని అన్నారు. నటుడుగా, నిర్మాతగా దర్శకుడిగా, ఎడిటరుగా, స్టూడియో అధినేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా చలనచిత్ర చరిత్ర పుఠలలో చిరస్థాయిగా నిలిచారన్నారు. భారతీయ చిత్ర చరిత్రలో సాంఘిక, జానపద, కౌబాయ్, చారిత్రాత్మక, జేమ్స్ బాండ్ పాత్రలలో నటించి మెప్పించిన ఏకైక హీరో కృష్ణ అవి అన్నారు. తెలుగు చలనచిత్ర గతిని మార్చిన హీరో కృష్ణ కు…
