* ఆలేరు ఇందిరా కాంగ్రెస్ భవనం వద్ద ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదని, మనకు ఈ రాజ్యాంగాన్ని అందించిన దార్శనికులకు నివాళులర్పిస్తున్నామని ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.ఏ ఏజాస్ పేర్కొన్నారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఇందిరా కాంగ్రెస్ భవనం వద్ద ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.ఏ ఏజాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేసిన అనంతరం ఏజాస్ మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కీలక చట్టాలు తెచ్చి దేశాన్ని కాంగ్రెస్ శక్తివంతంగా తీర్చిదిద్దిందని ఆయన తెలిపారు. మోదీ, కేసీఆర్ లాంటి నాయకులు ప్రజలను పట్టి పీడిస్తున్నారన్నారు. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులు…
Category: FILM NEWS
‘పద్మ’ పురస్కారాల విజేతలకు అభినందనలు : పవన్ కళ్యాణ్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారగ్రహీతల్లో స్థానం పొందిన తెలుగువారికి నా తరఫున జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. కోవిడ్ మహమ్మారిని అదుపు చేసేందుకు విస్తృత ప్రయోగాలు చేసి వ్యాక్సిన్ ఆవిష్కరించి ప్రపంచానికి అందించి… మన దేశ పరిజ్ఞాన విశిష్టతను చాటిన భారత్ బయోటెక్ సంస్థ కృషికిగాను ఆ సంస్థ వ్యవస్థాపకులు డా.కృష్ణ ఎల్లా, శ్రీమతి సుచిత్ర ఎల్లాలకు పద్మభూషణ్ పురస్కారం దక్కడం ముదావహం. సాఫ్ట్ వేర్ రంగంలో తెలుగువారి ఖ్యాతి చాటిన మైక్రోసాఫ్ట్ సి.ఈ.ఓ. శ్రీ సత్య నాదెళ్ళతోపాటు గూగుల్ సీఈవో, మన దక్షిణ భారతీయుడు శ్రీ సుందర్ పిచాయ్, కోవిడ్ వ్యాక్సిన్ అందించిన సీరం సంస్థ ఛైర్మన్ శ్రీ సైరస్ పూనావాలా పద్మభూషణ్ అవార్డుకు ఎంపికచేయడం సముచితం. దేశ రక్షణ కోసం విశిష్ట సేవలందించి ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో…
శ్రియా సరన్, శర్మాన్ జోషి ‘మ్యూజిక్ స్కూల్’ మూడో షెడ్యూల్ పూర్తి
ఇళయరాజా సంగీత సారథ్యంలో రాబోతోన్న `మ్యూజిక్ స్కూల్` సినిమా మూడో షెడ్యూల్ పూర్తయింది. శర్మాన్ జోషి శ్రియా శర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. కరోనా థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ నిర్వహించారు. దీని కోసం సెపరేట్‌గా స్టూడియో, లొకేషన్లు అన్నింటిని కూడా శానిటైజ్ చేశారు. సెట్‌లో అందరూ కూడా భౌతిక దూరాన్ని పాటించారు. కొత్త వారికి కరోనా పరీక్షలు నిర్వహించేవారు. ప్రతీ వారం అందరికీ కరోనా పరీక్షలు చేయించారు. ఇక సెట్‌లో ప్రతీరోజూ జనరల్ ఫిజీషియన్ అందుబాటులో ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని దర్శకుడు పాపరావు బియ్యాల ఎంతో కష్టపడి తెరకెక్కించారు. మేరీ డిక్రూజ్, మనోజ్ (శియా సరన్, శర్మాన్) పాత్రలు కళలు, సంగీతం, కల్చర్ విద్యల…
త్రిగుణ్ గా పేరు మార్చుకున్న యంగ్ హీరో అదిత్ అరుణ్
డిఫరెంట్ మూవీస్ తో, సర్ ప్రైజ్ చేసే క్యారెక్టర్స్ తో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అదిత్ అరుణ్. ఆయన నటించిన తుంగభద్ర, పీఎస్ వీ గరుడ వీకెండ్ లవ్, వేగ, డియర్ మేఘ, “డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ” లాంటి చిత్రాలు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ యంగ్ టాలెంటెడ్ తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు. రీసెంట్ ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ అనౌన్స్ చేశారు. ఇకపై తనను మీడియా మిత్రులు, చిత్ర పరిశ్రమలోని స్నేహితులు, పెద్దలు త్రిగుణ్ గా పిలవాలని ఈ యంగ్ హీరో కోరారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న “కొండా” చిత్రంలో నటిస్తున్న త్రిగుణ్..ఈ సినిమా తన కెరీర్ లో డిఫరెంట్ ఫిల్మ్ అవుతుందని చెబుతున్నారు. ‘కొండా’ ట్రైలర్…
‘రుద్రవీణ’ షూటింగ్ ప్రారంభం
శ్రీరామ్ నిమ్మల, ఎల్సా ఘోష్, శుభశ్రీ, సోనియా సత్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రుద్రవీణ. రఘు కుంచె ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. సాయి వీల సినిమాస్ పతాకంపై రాగుల లక్ష్మణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి మధుసూదన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా యానాం లో రుద్రవీణ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా అక్కడే జరుగుతుంది. సరికొత్త కథా కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రుద్రవీణ సినిమాను తెరకెక్కిస్తామని ఈ సందర్భంగా దర్శకుడు జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. న్యూ టాలెంటెడ్ ఆర్టిస్టులతో పాటు మంచి టెక్నికల్ టీమ్ సపోర్ట్ తో సినిమాను క్వాలిటీగా, అందరికీ నచ్చేలా రూపొందిస్తామని అన్నారు. ఛమ్మక్ చంద్ర, చలాకీ చంటి, ధన్ రాజ్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి…
మెగాస్టార్ తో మరోసారి త్రిష!?
త్రిష మెగాస్టార్ కి హీరోయిన్ గా నటించబోతుందట అంటూ సోషల్ మీడియాలో వార్త బాగా వైరల్ అవుతోందిప్పుడు. మెగాస్టార్ చిరంజీవితో యువతరం దర్శకుడు వెంకీ కుడుముల ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను ఫైనల్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు మెగాస్టార్ సరసన మరో హీరోయిన్ త్రిష పేరు కూడా వినిపిస్తోంది. చిరు – త్రిష జోడీ గతంలోనే ఒక సినిమా చేయాలి. కానీ, కొన్ని కారణాల కారణంగా ఆ సినిమా నుంచి త్రిష తప్పుకుంది. ఇప్పుడు ఈ జోడీ వెంకీ కుడుముల సినిమాలో కనిపింబోతుందట. మెగాస్టార్ కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి, వెంకీ సినిమాని కూడా త్వరలోనే పట్టాలెక్కి స్తారట. కాగా…
సౌత్ లో ‘అఖండ’ నార్త్ లో సల్మాన్‌తో మెయిన్ ఛాలా… జోరుమీదున్న ప్రగ్యా జైస్వాల్
`కంచె` సినిమా హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్‌కి సౌత్‌లో ప్రత్యేకంగా పరిచయాలేవీ అక్కర్లేదు. రీసెంట్‌గా అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో ప్రగ్యా జోరు మరో రేంజ్‌లో ఉంది. 50 రోజులు పూర్తి చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా నటించిన అఖండ సినిమా. అదే జోరుతో నార్త్ లోనూ హల్‌చల్ చేస్తోంది ప్రగ్యా జైస్వాల్. సల్మాన్ ఖాన్ సరసన మెయిన్ ఛాలా అంటూ ఆడిపాడి హిందీ డెబ్యూ ఇచ్చేశారు ప్రగ్యా. ఈ పాటలో సల్మాన్, ప్రగ్యా మధ్య కెమిస్ట్రీ అద్దిరిపోయిందని అంటున్నారు ఆడియన్స్. రీసెంట్ టైమ్స్ లో రిలీజైన సింగిల్స్ లో మెయిన్ ఛాలాకు మంచి స్పందన వస్తోంది. ఈ పాట గురించి ప్రగ్యా మాట్లాడుతూ “సల్మాన్ ఖాన్ సార్‌తో పనిచేయాలని ప్రతి ఆర్టిస్టుకీ ఒక కల ఉంటుంది. నేను ఈ రంగంలో అడుగుపెట్టినప్పుడు…
ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ విడుదలకు సిద్దమయ్యాడు. ఈ సినిమాపై మాస్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు నెలకొంటున్నాయి. మరి దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఫిబ్రవరి 25న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయాలని సిద్ధమయ్యారు. ఈ సినిమా ఫిబ్రవరి 25 రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదట. ఆల్రెడీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి గాను ఒక క్లారిటీ ఇచ్చేశారట. అందులో భాగంగా ఈ చిత్రాన్ని అక్కడ భారీ స్థాయి విడుదలకి ప్లాన్ చెయ్యాలని చూస్తున్నారట. అన్ని భాషల నుంచి కూడా పెద్దగా ఎలాంటి సినిమాలు లేకపోవడంతో ‘భీమ్లా నాయక్’ కు మరింత ప్లస్ అయ్యిందని చెప్పాలి.
బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకు చిరు ఎందుకు రాలేదు?
ఓటీటీలో అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ తో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోతో బాలయ్య యావత్తు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ షోకి చాలా మంది సేలబ్రిటీలు వచ్చారు. వారితో సరదాగా మాట్లాడుతూనే ప్రేక్షకులకు కావల్సిన కాంట్రవర్సీస్ మొదలకొని ఎమోషన్స్ వరకు అన్ని కోణాల్లో ప్రశ్నలు గుప్పిస్తూ అలరిస్తారు బాలయ్య. అయితే తాజాగా ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. అదేంటంటే ఇంత మంది సెలబ్రిటీలు వచ్చిన ఈ షోకి టాలీవుడ్ మెగా బాస్ చిరంజీవి రాకపోవడం వెనక ఏంటి మతలబు అంటూ కొందరు ఆరా తీస్తున్నారు. మొదలుపెట్టిన రోజు నుంచి ఈ షోకు చిరంజీవి వస్తారా.. రారా? అనే చర్చ ఓవైపు నడుస్తూనే ఉండగా, మరోవైపు బాలయ్య టాక్ షో సీజన్-1 పూర్తయింది. చిరంజీవి లేకుండానే ఓ సీజన్ ముగిసింది. ఇంతకీ బాలయ్య టాక్…
‘జయహో ఇండియన్స్’ నుంచి విడుదలైన ‘ఆంథమ్’కు అనూహ్య స్పందన!!
ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా జయహో ఇండియన్స్. ఆర్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేదెవరు.. నాయకులా..? అమాయకులా..? దేశమా..? ఈ కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అది స్పష్టంగా పోస్టర్లో కనిపించేలా హీరో లుక్ డిజైన్ చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమా వీడియో సాంగ్ విడుదలైంది. జయహో ఇండియన్స్ ఆంథమ్ ఇది. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. ఈ పాటలో లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. జైపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్. ఈ…
