మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పాటలు, ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపధ్యంలో డైరెక్టర్ మెహర్ రమేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఫస్ట్ డే మైక్ పట్టుకున్నపుడు ఎలా అనిపించింది ? భోళా శంకర్ షూటింగ్ 2021 నవంబర్ 15న మొదలుపెట్టాం. మొదటి రోజే దాదాపు ఏడు వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లు, భారీ సెట్…
Category: FILM NEWS
‘వాల్తేరు వీరయ్య’ 200 రోజులు వేడుకని చూస్తుంటే చరిత్రని తిరగరాసినట్లుగా అనిపించింది: మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్’ వాల్తేరు వీరయ్య’- గ్రాండ్ గా జరిగిన 200 డేస్ షీల్డ్స్ ప్రజంటేషన్ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’, మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించిన చిత్రం 2023 సంక్రాంతికి విడుదలై టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా 200 రోజులను పూర్తి చేసుకుంది. ఇది చిరంజీవి, రవితేజలకు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటి. సినిమా 200 రోజుల రన్ పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ టీమ్ మొత్తానికి, డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్స్ అందించారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ పాల్గొన్న ఈ గ్రాండ్ ఈవెంట్ లో దర్శకులు హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఊహించిన విధంగా మధ్యలో చాలాసార్లు నిలిచిపోయింది. ఈ సినిమా స్క్రిప్టి దశలోనే అనేక రకాల మార్పులతో ఆలస్యం అయింది. ఇక మొత్తానికి హరీష్ శంకర్ చాలా హడావిడిగానే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా మళ్లీ పవన్ కళ్యాణ్ ఎప్పటిలానే రాజకీయాలలో బిజీ అయిపోయి సినిమాను కాస్త పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక పవన్ కేవలం ఇప్పుడు ఓజి సినిమా పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు అని కూడా కథనాలు రావడంతో ఉస్తాద్ ‘భగత్ సింగ్’ కూడా ఆగిపోతుందేమో అని అనేక రకాల గాసిప్స్ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాపై ఇలాంటి కథనాలు వైరల్ అవుతున్న సమయంలోనే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని…
హాట్ టాపిక్ గా చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు!
బాబీ దర్శకత్వంలో చిరంజీవి రవితేజ నటించిన చిత్రం ’వాల్తేరు వీరయ్య’ సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా… చిత్రబృందమంతా వేడుక చేసుకుంది. ఈ సందర్భంగా మైకందుకున్న మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును… ప్రత్యేకంగా ఎవరినైనా ఉద్దేశించి అంటున్నారనే విషయంలో పూర్తి స్పష్టత లేనప్పటికీ… తాజాగా ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా…యాక్టర్ల రెమ్యూనరేషన్ పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ`ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలని చిరంజీవిఅన్నారు. ఇదే సమయంలో… పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలి.. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి? అని చిరంజీవి స్పందించారు. అనంతరం ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర విజయం…
‘ఖుషి’ ప్రమోషన్స్‌లో పాల్గొననున్న సమంత
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ’ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. చాలా నెలల క్రితమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా సమంత అనారోగ్య కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయింది. విడుదలకు ఇన్నాళ్ల సమయం పట్టింది. సినిమా విడుదల విషయంలో ఎలాంటి డౌట్ లేదు.. కానీ సినిమా విడుదల సమయంలో ప్రమోషన్స్ కి సమంత హాజరు అయ్యేనా లేదా అనేది గత కొన్ని రోజులుగా సస్పెన్స్ గా ఉంది. ఎందుకంటే సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. అంతే కాకుండా చికిత్స నిమిత్తం సమంత విదేశాలకు వెళ్లబోతుందనే వార్తలు వస్తున్నాయి. ’ఖుషి’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత పాల్గొనే అవకాశాలు లేవని అంతా భావించారు. కానీ తాజాగా…
బాలీవుడ్‌కు బన్నీ ‘నో’ అంటున్నాడు!
‘అల వైకుంఠపురం లో..’ సినిమాతో రికార్డు సృష్టించి.. ‘పుష్పతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టి తిరుగులేని స్టార్‌గా ఎదిగాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు ఆయన సినిమా కోసం యావత్ సినీ లవర్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. రెండేళ్ల కిందట విడుదలైన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. ఎలాంటి ప్రమోషన్‌లు లేకుండానే హిందీ బెల్ట్‌పై వంద కోట్ల బొమ్మతో నార్త్ ఆడియెన్స్‌తో జైజైలు కొట్టించుకున్నాడు. ప్రస్తుతం బన్నీ ’పుష్ప`2’తో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌తో చేతులు కలుపుతున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ ఉంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా బన్నీ…
ఆలియా భట్ హాలీవుడ్ ఎంట్రీ!
బాలీవుడ్ లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ’ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ద్వారా అలియా తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు హాలీవుడ్ లో తన నటనను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ ’హార్ట్ ఆఫ్ స్టోన్’ చిత్రం ద్వారా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో మొదటిసారి ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా అలియా భట్ తన సహ నటులు గాల్ గడోట్, జేవిూ డోర్నన్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా హాలీవుడ్ నటి గాల్‌కు తెలుగు నేర్పించే…
అభిమానిని కూల్ చేసిన మిల్కీ బ్యూటీ!
సెలబ్రెటీలు బయటకు వెళ్తే ఎవరో ఒకరు సెల్ఫీ అని లేదా మరేదైనా కారణం చెప్పి దగ్గరకు వచ్చి మాట్లాడేందుకు, టచ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ బౌన్సర్ లు లేకుండా బయటకు అడుగు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటుంది. చుట్టూ ఎంత మంది బౌన్సర్ లు ఉన్నా కూడా కొన్ని సార్లు హీరోయిన్స్ కి అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకు అదే పరిస్థితి ఎదురైంది. ఒక కార్యక్రమంకు హాజరు అయిన మిల్కీ బ్యూటీ తమన్నా ను ఫ్యాన్ ఒకరు దూసుకు వచ్చి పట్టుకున్నాడు. ఆమె చేయి పట్టుకోవడంతో పాటు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా తమన్నా షాక్ అయినట్లుగా ఫేస్ పెట్టింది. అంతే కాకుండా ఆమె భపడిరది. బారీకేడ్లు దూకి వచ్చిన అభిమానిని బౌన్సర్ లు తోసేందుకు…
9న రానున్న ‘ఖుషీ’ ట్రైలర్!
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ’ఖుషి ’. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాల ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తికాగా.. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌తోపాటు ’నా రోజా నువ్వే’ ’ఆరాధ్య’ ’ఖుషి’ అంటూ సాగే పాటలకు సోషల్‌విూడియాలో మంచి స్పందన లభిస్తున్నది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఎప్పుడెప్పుడా అని విజయ్, సమంత ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చేస్తున్న ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది. ఆగష్టు 9న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్…
‘రానా నాయుడు’ సెకండ్ సీజన్‌కు రెడీ!
విక్టరీ వెంకటేష్, రానా ఇద్దరు దగ్గుబాటి హీరోలు కలిసి చేసిన వెబ్ సీరీస్ రానా నాయుడు. నెట్ ప్లిక్స్ వారు నిర్మించిన ఈ సీరీస్ నార్త్ సైడ్ ఆడియన్స్‌ని బాగా మెప్పించింది. కొద్దిగా అడల్ట్ డోస్ ఎక్కువైందన్న కామెంట్స్ వచ్చినా అది హిందీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. అయితే తెలుగులో వెంకటేష్ కి ఉన్న ఇమేజ్ వల్ల రానా నాయుడు సీరీస్ లో ఆ పాత్రను డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అయితే రానా నాయుడు సీజన్ 1 సూపర్ సక్సెస్ అవడంతో సీజన్ 2ని కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రానా నాయుడు సీజన్ 2 సినిమా కోసం వెంకటేష్, రానా రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.సీజన్ 1 హిట్ అవడం ఒక రీజన్ కాగా సీరీస్ కి ప్రేక్షకులలో ఉన్న డిమాండ్…
