‘ఖుషి’ ప్రమోషన్స్‌లో పాల్గొననున్న సమంత

Samantha will participate in the promotions of 'Khushi'
Samantha will participate in the promotions of 'Khushi'
Spread the love

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ’ఖుషి’ చిత్రం సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. చాలా నెలల క్రితమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా సమంత అనారోగ్య కారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యం అయింది. విడుదలకు ఇన్నాళ్ల సమయం పట్టింది. సినిమా విడుదల విషయంలో ఎలాంటి డౌట్‌ లేదు.. కానీ సినిమా విడుదల సమయంలో ప్రమోషన్స్‌ కి సమంత హాజరు అయ్యేనా లేదా అనేది గత కొన్ని రోజులుగా సస్పెన్స్‌ గా ఉంది. ఎందుకంటే సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. అంతే కాకుండా చికిత్స నిమిత్తం సమంత విదేశాలకు వెళ్లబోతుందనే వార్తలు వస్తున్నాయి. ’ఖుషి’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో సమంత పాల్గొనే అవకాశాలు లేవని అంతా భావించారు. కానీ తాజాగా బాలి నుంచి చెన్నైకి సమంత వచ్చేసింది. ఇటీవల తన తల్లిదండ్రుల వద్ద మరియు చిన్మయి ఇంటి వద్ద సందడి చేసింది. అంతే కాకుండా తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ లో ఖుషి సినిమా పోస్టర్‌ ను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. షూటింగ్‌ లకు హాజరు అవ్వకున్నా కూడా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో అయినా సమంత పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది. ఖుషి సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం హైదరాబాద్‌ వచ్చి ఒకటి రెండు ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అన్నట్లుగా ఖుషి యూనిట్‌ సభ్యులు మాట్లాడుకుంటున్నారు. సమంత ఖుషి ప్రమోషన్స్‌ లోనే కాకుండా సిటాడెల్‌ ప్రమోషన్స్‌ లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సమంత ఖుషి సినిమా విడుదల ముందు విదేశాల నుండి రావడం పట్ల ఖుషి మేకర్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.