ఇప్పుడు యావత్ దేశం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తోంది. తెలుగులో వస్తున్న సినిమాలు ఏమిటి? తెలుగులో ప్రతిభావంతులైన దర్శకులు ఎవరు? అని ఆరా తీస్తోంది. తెలుగు కథలతో పాటు కొంత మంది తెలుగు దర్శకులను అక్కడ సినిమా ఇండస్ట్రీకి తీసుకువెళుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘జెర్సీ’, ‘అల… వైకుంఠపురములో’ వంటి సినిమాలు హిందీలో, ఇతర భాషల్లో రీమేక్ అవుతున్నాయి. అలాగే, ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమానూ తమిళంలో రీమేక్ చేశారు. హేమంబర్ జాస్తి దర్శకత్వం వహించారు. ‘కేరాఫ్ కాదల్’ పేరుతో ఆ సినిమా విడుదలైంది. హేమంబర్ జాస్తి తెలుగువారే. ‘రాజకుమారుడు’, ‘ఒక్కడు’ సహా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన పలు చిత్రాలకు ఆయన కో – డైరెక్టర్‌గా పని చేశారు. దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు, మణిరత్నం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, గుణశేఖర్ తదితర దిగ్గజ దర్శకుల…
Author: M.D ABDUL - Tollywoodtimes
క్రిస్మస్ మనదే : శ్యామ్ సింగ రాయ్ హీరో నాని
న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. వేణు శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘ఎంసీఏ తరువాత నాకు వెంకట్ గారు మొదట అడ్వాన్స్ ఇచ్చారు. లాభం తక్కువ వచ్చినా పర్లేదు కానీ మంచి సినిమా తీయమని అన్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ మీద మున్ముందు చాలా మంచి సినిమాలు రాబోతోన్నాయి. వెంకట్ గారికి ఈ చాన్స్ ఇచ్చినందుకు నానికి థ్యాంక్స్. ట్రైలర్ చూస్తుంటేనే ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో అర్థమవుతోంది. ఆల్…
ఏ.ఆర్ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెంబర్-1 ప్రారంభం
ఏ సురేష్ ప్రభు సమర్పణలో ఏ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై విజయ్, శీతల్ బట్ హీరో హీరోయిన్లు (నూతన పరిచయం) గా సురేష్ ప్రభు దర్శకత్వంలో ఏ.ఆర్ రాకేష్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్-1 చిత్రం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు గోపిచంద్ మలినేని హీరో, హీరోయిన్స్ పై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో… చిత్ర నిర్మాత ఏ ఆర్ రాకేష్ మాట్లాడుతూ ..సినిమా రంగంపై ప్రేమతో చాలా రోజుల నుండి సినిమా తీయాలనే ఆలోచనతో ఉండగా సురేష్ ప్రభు చెప్పిన కథల్లో ఈ సినిమా…
NSUI ఆధ్వర్యంలో ఆలేరులో ఇంటర్మీడియట్ కళాశాలలు బంద్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో NSUI ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ బంద్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా NSUI మండల అధ్యక్షులు సుంకరి విక్రమ్ మాట్లాడుతూ.. మొన్న విడుదలైన ఇంటర్మీడియేట్ ఫలితాలలో జరిగిన తప్పిదాలకు బలైన విద్యార్థుల న్యాయం కోసం NSUI పోరాడుతుంటే ఇంటర్మీడియేట్ బోర్డు కనీసం స్పందించకుండా పోలీసులను అడ్డం పెట్టుకోని మమ్మల్ని అడ్డుకోవడం వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడంలో భాగమేనని మండిపడ్డారు. అలాగే విద్యార్థుల ప్రాణాలకు బాధ్యులైన తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు తీరుకు నిరసనగా ఈరోజు ఆలేరులో ఉన్నటువంటి అన్ని జూనియర్ కళాశాలను NSUI ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగిందని చెప్పారు.
రూటు మార్చిన పూర్ణ!?
పూర్ణ స్టార్ హీరోయిన్ కావాలని కలలుకంది. ఎన్నో ఆశలతో వెండితెరపై అడుగుపెట్టింది. తన కెరీర్ లో మంచి విజయాలు అందుకున్నా.. ఎందుకనో మరి సాలిడ్ ప్లాట్ ఫార్మ్ మాత్రం ఇంకా పడలేదు. కాసింత నిరాశపడుతూనే అనుకున్నది సాధించాలనే కసితో, పట్టుదలతో అడుగులు ముందుకు వేస్తోంది. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ దశకు చేరువవుతున్న తరుణంలో ఎంతో తెలివిగా కెరీర్ ని సరికొత్తగా డిజైన్ చేసుకుంటోంది. హీరోయిన్ గానే చేస్తానంటూ మడిగట్టుకు కూర్చోకుండా… విభిన్న పాత్రలపై దృష్టి సారించింది. ఆ పాత్రల ద్వారా నటిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. దానిలో భాగంగానే స్టార్ హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రలను పోషించేలా చూసుకుంటోంది. తాజాగా బాలకృష్ణ -బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’లో పూర్ణ కీలక రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ…
విజయ్ ఆంటోనీ హీరోగా ఎమోషన్ థ్రిల్లర్ ‘విక్రమ్ రాథోడ్’
విజయ్ ఆంటోనీ… తమిళ సినిమాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. స్టార్ హీరోలకు మాదిరిగా పేరుకు ముందు పేరు తర్వాత పెద్ద టైటిల్స్ ఏమీ లేనప్పటికీ.. ఆడియెన్స్‌ని ఆలోచింపచేసే విధంగా కథలు ఎంచుకుని సినిమాలు చేయడంలో ముందుండే హీరో అనే పేరు మాత్రం ఉంది. టాలీవుడ్‌లోనూ విజయ్ ఆంటోనీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. బిచ్చగాడు చిత్రం నుంచే విజయ్ ఆంటోనీ చిత్రాలకు మంచి ఆధరణ ఉంది.తాజాగా మరొక డీఫ్రెంట్ కథాంశంతో “విక్రమ్ రాథోడ్” గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పెప్సి శివ సమర్పణలో విజయ్ ఆంటోని కథానాయకుడిగా, రెమిసెస్ హీరోయిన్ గా సురేష్ గోపి, సోనూసూద్, యోగిబాబు నటీ, నటులుగా తమిళ దర్శకుడు బాబు యోగేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న తమిళరసన్ సినిమాను తెలుగులో “విక్రమ్ రాథోడ్” అనే టైటిల్‌తో డబ్ అవుతోంది ఈ సినిమాను…
అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా ‘హిట్ 2’ గ్లింప్స్ విడుదల
‘క్షణం, గూఢచారి, ఎవరు’ వంటి వైవిధ్యమై కథా చిత్రాల్లో హీరోగా నటించిన తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు అడివి శేష్. ఈ వెర్సటైల్ హీరో ఇప్పుడు దేశభక్తితో నిండిన పాన్ ఇండియా మూవీ ‘మేజర్’తో పాటు సీట్ ఎడ్జ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్ 2’తోనూ తెలుగు ప్రేక్షకులను మెప్పించనున్నారు. ‘హిట్ 2’ను హీరో నాని సమర్పణలో వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మిస్తున్నారు. శుక్రవారం (డిసెంబర్ 17) అడివి శేష్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను హీరో, చిత్ర సమర్పకుడు నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఇందులో అడివి శేష్ ఇందులో ఆంధ్రప్రదేశ్ చెందిన హిట్ టీమ్ ఆఫీసర్ కృష్ణ దేవ్ అలియాస్ కె.డిగా మెప్పించనున్నారు. గ్లింప్స్‌ను గమనిస్తే.. పోలీస్ ఆఫీసర్ డ్రెస్‌లో అడివి శేష్…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : 100 మొక్కలు నాటిన ‘మనం సైతం’ కాదంబరి కుటుంబ సభ్యులు
ప్రముఖ నటులు, మనం సైతం సేవా సంస్థ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ కుటుంబ సభ్యులు ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాదంబరి కిరణ్ గారి పెద్ద కుమార్తె సత్య శ్రీకృతి, ఈశ్వర్ వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రపురి కాలనీలోని ఆయన స్వగృహం వద్ద 100 మొక్కలతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులతో మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, వసంతరావు, చిత్రపురి కమిటీ సభ్యులు దీప్తి వాజ్ పాయ్, అనిత నిమ్మగడ్డ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…నా కుమార్తె సత్య శ్రీకృతి, ఈశ్వర్ వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ మా ఇంటి వద్ద 100 మొక్కలతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నూతన…
‘దీనశరణ్య’ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలపై అవగాహన
సికింద్రాబాద్ లోని మహబూబ్ డిగ్రీ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలపై ఉచిత అవగాహన కార్యక్రమం దీనశరణ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జెస్వాల్ సంజయ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికా బద్దంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగములో అయినా ముందుగా చేరి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వివరించారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. సంస్థ అధ్యక్షుడు చింతల సాయి బాబా మాట్లాడుతూ సివిల్స్ పోటీ పరీక్షలకు ప్రభుత్వం నిర్బహించే స్టడీ సర్కిల్స్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఏసీపీ బీ రమేష్, హైకోర్టు న్యాయవాదులు గ్లోరీ ఆనంద, సంపత్ కుమార్, రాజు, మొటివేటర్ దాసి శంకర్, నాయకులు…
శ్రీలంకలో మహ్మద్ రఫీకి ‘గ్లోబల్ ఐకాన్’ పురస్కారం
సీనియర్ పాత్రికేయులు, కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ ని గ్లోబల్ ఐకాన్ పురస్కారం తో శ్రీలంక లో ఘనంగా సత్కరించారు. శ్రీలంక తెలుగు సంఘం, గ్లోబల్ ఫౌండేషన్, కర్ణాటక సంయుక్తంగా శుక్రవారం బెంటోట కొలొంబో లో 27వ అంతర్జాతీయ సాంస్కృతికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడు దశాబ్దాలుగా పాత్రికేయ రంగం లో ఉండి సాంస్కృతిక వికాసానికి విశేష కృషి చేస్తున్న డాక్టర్ మహ్మద్ రఫీ ని ప్రత్యేకంగా తెలంగాణ నుంచి ఆహ్వానించి అంతర్జాతీయ పురస్కారం తో సన్మానించారు. శ్రీలంక, ఇండియా నుంచి వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న 12 మందిని సత్కరించినట్లు ఉత్సవ కమిటి చైర్మన్ మంజునాథ సాగర్ తెలిపారు. ఈ వేడుకలను రామకృష్ణ మఠం స్వామిజీ మహాదేవ ఉపాధ్యాయ జ్యోతి ప్రజ్వలనం చేసి లాంఛనంగా ప్రారంభించారు. భారతీయ, శ్రీలంక శాస్త్రీయ జానపద సంస్కృతీ…
