‘మా ఇంటి బంగారం’టీమ్‌కు మెగాస్టార్ అభినందన

Megastar congratulates the ‘Maa Inti Bangaram’ team.
Spread the love

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది. స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. కాగా.. ‘మాఇంటిబంగారం’ చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్బంగా సమంత, రాజ్ నిడిమోరు దంపతులతో పాటు దర్శకురాలు నందిని రెడ్డిని అభినందించి సినిమా ఘన విజయంపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ కావడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ చిత్రానికి వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్ ఈ చిత్ర కలెక్షన్స్ పై ప్రభావం చూపెడుతోంది. దీంతో ఈ సినిమా చెప్పుకోతగ్గ వసూళ్లు రాబట్టింది. ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఈ స్థాయి కలెక్షన్స్ ఇంత తక్కువ సమయంలో రావడం విశేషం. ఇక బాక్సాఫీస్ దగ్గర మరే ఇతర సినిమా కూడా పోటీలో లేకపోవడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, శ్రీముఖి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. మరి ఈ సినిమా మున్ముందు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

Related posts