రచ్చ’రవి’లో మరో కోణం….’నీ రుణం తీరేది ఎట్ల?

Another angle on the fuss 'Ravi'....'How will you pay off your debt?
Spread the love

▪️ మహిళా దినోత్సవం సందర్భం గా కవి,రచయిత నటులు తనికెళ్ళ భరణి చేతులమీదుగా పోస్టర్ ఆవిష్కరణ…
▪️ మాతృదినోత్సవం (మే 10) సందర్బంగా మరో ఆవిష్కరణకు సన్నద్ధం…

హన్మకొండ పట్టణానికి చెందిన ప్రముఖ సినీ నటులు ‘రచ్చ’రవి మహిళా దినోత్సవం (8 మార్చి) సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం ‘నీ రుణం తీరేది ఎట్ల?’ అనే పోస్టర్ ను సినీ కవి, రచయిత, ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భం గా ‘రచ్చ’ రవి నేడొక ప్రకటనలో పోస్టర్ విడుదలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ.. నగర ప్రజల ప్రోత్సాహం తల్లి దండ్రుల ఆశీర్వాదంతో ఇప్పటివరకు బుల్లి, వెండితెరలపై అనేక వైవిధ్య పాత్రలను పోషించే అవకాశం దక్కిందని, ఇప్పటి వరకు సుమారు 150 సినిమాలలో విభిన్న పాత్రలలో నటించే అవకాశం దక్కిందని తాను నటించిన అన్ని పాత్రలు సంతృప్తిని కలిగించాయని, మహిళ లేనిదే సమాజం లేదని అమ్మగా.. అక్కగా.. చెల్లిగా.. భార్యగా విభిన్న పాత్రలు పోషించేది కేవలం మహిళలేనని మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా ‘నీ రుణం తీరేది ఎట్ల?’ అనే పోస్టర్ ను ఆవిష్కరించుకోవడం జరిగిందని, ఇదే క్రమంలో మహిళామణులను గౌరవించుకోవడం మన బాధ్యత అని ఇందుకోసం మే 10 మాతృ దినోత్సవం సందర్భం గా మరో ఆవిష్కరణకు సిద్ధం అవుతున్నట్లు ఈ సందర్భంగా ‘రచ్చ’రవి తెలిపారు.

Related posts