మెగాస్టార్ చిరంజీవి మనవరాలు.. రామ్ చరణ్, ఉపాసన దంపతుల మొదటి బిడ్డ క్లింకార కొణిదెల గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ముహూర్తంలో ఈ చిన్నారి మెగా ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఆ ఇంటికి అదృష్టం పట్టిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వివాహానంతరం దాదాపు పదేళ్ళ తరువాత ఉపాసన.. క్లింకారకి జన్మనిచ్చింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ చిన్నారి ముఖం చూస్తామా అని మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. మూడేళ్ళ తరువాత చరణ్ – ఉపాసన.. తమ గారాల పట్టీ క్లింకార ముఖాన్ని అభిమానులకు చూపించారు. ఎన్నోసార్లు క్లింకార ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. బయటకు వచ్చినప్పుడు ఆమె ముఖాన్ని దాచడానికి చరణ్ పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. తనను ఎప్పుడైతే…
Day: June 20, 2026
చార్ట్‌బస్టర్‌గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఒరియా పిల్ల సాంగ్
భిన్నమైన కథలు, ఎంటర్‌టైనింగ్ పెర్ఫార్మెన్స్ తో అలరిస్తున్న ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు, సరికొత్త నేపథ్యంతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో, కోన వెంకట్ సమర్పణలో, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కు ఇప్పటికే అద్భుతమైన స్పందన లభించింది. 1992 నాటి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇందులో మహిమ నంబియార్ కథానాయికగా నటిస్తోంది. చిత్ర బృందం ఈ రోజు ఈ సినిమాలోని మొదటి పాట ‘ఒరియా పిల్ల’ను లాంచ్ చేశారు. ఈ పాట ‘కామ్రేడ్ కళ్యాణ్’లోని రొమాంటిక్ వరల్డ్ ని పరిచయం చేస్తూ, ఒక సున్నితమైన ప్రేమకథను ప్రజెంట్ చేసింది. సంగీత దర్శకుడు…
దర్శక, నిర్మాతలకు ఫిలింక్రిటిక్స్ శుభాకాంక్షలు
ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ పున:ప్రారంభం అయిన నాటి నుండి ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ ఉనికిని చాటు కోవడం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. అందులో భాగంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ముఖ్యులైన నిర్మాతలకు, దర్శకులకు, నటీనటులకు వారి జన్మదినం సందర్భంగా కలిసి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరుపున శుభాకాంక్షలు అందజేస్తున్నారు. అందులో భాగంగానే శనివారం ఎన్నో విజయవంతమైన సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన వివేక్ కూచిభట్ల, రచ్చ, బెంగాల్ టైగర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసిన ప్రతిభావంతమైన యువ దర్శకుడు సంపత్ నందిల పుట్టిన రోజు సందర్భంగా వారిని పెద్దమ్మ గుడిలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ యాభైఎనిమిది సంవత్సరాల వయసు గలది. సినిమా జర్నలిజంలో భీష్మాచార్యులైనటువంటి పియస్‌ఆర్ ఆంజనేయ శాస్త్రి, గుడిపూడి శ్రీహరి, గౌతం, వరదాచారి లాంటి…
Deewana telugu movie Review : రొమాంటిక్ డ్రామా!
టాలీవుడ్ లో ప్రేమకథలకు కొదువేలేదు. ఇప్పటివరకూ వచ్చిన ప్రేమకథా చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. నాటి దేవదాసు, గీతాంజలి మొదలుకొని.. మొన్నటి అర్జున్ రెడ్డి వరకు టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన లవ్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. ఇటీవలి కాలంలో సీతారామం, బేబీ, హాయ్ నాన్న లాంటి ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. తాజాగా కల్కి, శుభం తదితర సినిమాల్లో నటించిన హర్షిత్‌రెడ్డి, నూతన నటి స్మేహ మణిమేఘలై జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘దీవానా’ నేడు (జూన్ 20, 2026) థియేటర్లలో విడుదలయింది. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అర్హ మీడియా బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవీ కార్యంపూడి నిర్మించారు. సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకొని, గత రెండు నెలలు క్రితమే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమా…
