దర్శక, నిర్మాతలకు ఫిలింక్రిటిక్స్ శుభాకాంక్షలు

Film critics extend their best wishes to the directors and producers.
Film critics extend their best wishes to the directors and producers.
Spread the love

ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ పున:ప్రారంభం అయిన నాటి నుండి ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ ఉనికిని చాటు కోవడం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. అందులో భాగంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ముఖ్యులైన నిర్మాతలకు, దర్శకులకు, నటీనటులకు వారి జన్మదినం సందర్భంగా కలిసి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరుపున శుభాకాంక్షలు అందజేస్తున్నారు. అందులో భాగంగానే శనివారం ఎన్నో విజయవంతమైన సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన వివేక్‌ కూచిభట్ల, రచ్చ, బెంగాల్‌ టైగర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను తీసిన ప్రతిభావంతమైన యువ దర్శకుడు సంపత్‌ నందిల పుట్టిన రోజు సందర్భంగా వారిని పెద్దమ్మ గుడిలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్‌ యాభైఎనిమిది సంవత్సరాల వయసు గలది. సినిమా జర్నలిజంలో భీష్మాచార్యులైనటువంటి పియస్‌ఆర్‌ ఆంజనేయ శాస్త్రి, గుడిపూడి శ్రీహరి, గౌతం, వరదాచారి లాంటి వారు స్థాపించిన సంస్థ ఇటీవలే పున: ప్రారంభమైందని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడు బత్తులప్రసాదరావు, వైస్‌ ప్రసిడెంట్ ఎం.డి అబ్దుల్, సీనియర్‌ జర్నలిస్టు.. అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ మామిడిపల్లి గిరధర్‌ లు, సహాయ కార్యదర్శి పర్వీన్‌ బాబి పాల్గొన్నారు.