టాలీవుడ్ లో ప్రస్తుతం మన స్టార్ హీరోలు అంతా క్రేజీ ప్రాజెక్ట్ లతో యమ బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి వారిలో మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య కూడా ఒకరు. అయితే ఈ ముగ్గురూ తమ భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా.. ఈ ముగ్గురూ కూడా తమ సినిమాలతో యాక్షన్ మోడ్ లో ఎంతో హుషారుగా ఉన్నారు. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో చేస్తున్న భారీ పీరియాడిక్ డ్రామా ‘ఫౌజీ’ లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 3న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతున్నప్పటికీ, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై ప్రెషర్ పెరుగుతుంది. ముందుగా కుదుర్చుకున్న ఓటిటి ఒప్పందాల ప్రకారం ఈ ఏడాది చివరలోపు సినిమాను రిలీజ్ చేయాల్సి ఉండటంతో, ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్‌లో పాల్గొంటూనే దీనిని కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం కొన్ని పాటలు, ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. సరైన టైమింగ్‌లో వస్తే బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’, ‘పుష్ప 2’ రికార్డులను టార్గెట్ చేసే సత్తా ఈ చిత్రానికి ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. అలానే నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా స్టార్ హీరోయిన్ కాజల్ హీరోయిన్ గా బాలయ్యతో దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్ ని చేసినట్టు తెలిసింది. బాలయ్య తన కెరీర్ 111వ సినిమాగా చేస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. ఈసారి వింటేజ్ కూడా న్యూ ఏజ్ అంటూ బాలయ్యని సరికొత్త వెర్షన్ లో ప్రెజెంట్ చేస్తూ వదిలిన గ్లింప్స్ మంచి హిట్ అయ్యింది. ఇక ఇదే కాకుండా సినిమా అవుట్ పుట్ అంతా కూడా మ్యాడ్ లెవెల్లో వస్తుందట. మంచి క్వాలిటీ, సాలిడ్ సీక్వెన్స్ లతో బాలయ్య అభిమానులకి మంచి ట్రీట్ గ్యారెంటీ అట. అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించి తాజాగా చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్ కూడా అద్భుతంగా వచ్చింది అని తెలుస్తుంది. సినిమాలో ఇది మరో లెవెల్లో ఉంటుంది అని టాక్. ఇలా మొత్తానికి బాలయ్య 111 ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే విధంగా వస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కలయికలో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కలయికలో వస్తున్న సినిమా ఇది కావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. పైగా డాకు మహారాజ్ లాంటి క్వాలిటీ ప్రొడెక్టు తర్వాత బాబీ నుంచి సినిమా కావడంతో టాలీవుడ్ ఆడియెన్స్ మరింత ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మెగాస్టార్ తన 158వ సినిమా కోసం బాబీతో ఒక ఊహించని యాక్షన్ ఎపిసోడ్ ని అది కూడా రిస్కీ స్టంట్స్ ని నేరుగా చిరునే చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్. ఇలా స్టార్ట్ అయ్యిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకెళుతుంది. కొన్ని రోజులు కితమే పొలాచ్చిలో మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు హైదరాబాద్ లో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షూట్ లో ఓ మెంటల్ మాస్ యాక్షన్ ఎపిసోడ్ ని ఫైట్ మాస్టర్స్ రామ్, లక్షణ్ లు డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. గూస్ బంప్స్ ఇచ్చే రేంజ్ లో ఈ ఎపిసోడ్ ఉంటుందట. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా మన తెలుగు సినిమాకి చెందిన టాప్ హీరోలంతా ఇంట్రెస్టింగ్ గా యాక్షన్ మోడ్ లోనే ఉండడం గమనార్హం.
స్పెషల్ స్టోరీ…యాక్షన్ మోడ్ లో టాప్ హీరోలు!
