* అదిరిపోయే అవతార్ లో కనిపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి తాజాగా విడుదలైన శక్తివంతమైన గ్లింప్స్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపుతోంది. పవన్ కళ్యాణ్ అద్భుతమైన, కమాండింగ్ అవతార్‌లో కనిపించిన ఈ గ్లింప్స్.. ప్రేక్షకులు తెరపై చూడటానికి ఇష్టపడే మాస్ ఎనర్జీ, చరిష్మాను సంపూర్ణంగా సంగ్రహించింది. ఈ గ్లింప్స్ విడుదలైన క్షణం నుంచే సామాజిక మాధ్యమాల్లో అద్భుతమైన స్పందన లభిస్తోంది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రభావవంతమైన డైలాగులు,శక్తివంతమైన బాడీ లాంగ్వేజ్ అభిమానులు, ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ చిన్న గ్లింప్స్ ఇప్పుడు సినీ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారింది. అభిమానులచే ‘కల్ట్ కెప్టెన్’ అని ప్రశంసించబడే దర్శకుడు హరీష్ శంకర్, ప్రేక్షకులు ఆరాధించే విధంగా పవన్ కళ్యాణ్‌ను మరోసారి ఉత్తేజపరిచే…
Day: March 7, 2026
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలకు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ శుభాకాంక్షలు
గద్దర్ ఫిలిం అవార్డ్స్ కు సంబంధించిన 2025 సంవత్సరపు విజేతల జాబితా అధికారికంగా ప్రకటించబడింది. ప్రజాగాయకుడు గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా సినీ రంగంలో వివిధ విభాగాల్లో విజేతలుగా ఎన్నికయిన వారందరికీ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారికి ఉత్తమ పుస్తక రచయితగా గద్దర్ అవార్డుకు ఎన్నికవ్వడం ఫిలిం క్రిటిక్స్ సభ్యులతో పాటు ప్రతీ సినిమా జర్నలిస్ట్ గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరుపున ప్రతీ విజేతకు హృదయపూర్వక అభినందనలు. విజేతలైన ఉత్తమ నటుడు- నాగ చైతన్య (తండేల్) ఉత్తమ నటి- రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్) ఉత్తమ చిత్రం- రాజు వెడ్స్ రాంబాయి ఉత్తమ ద్వితీయ చిత్రం- దండోరా ఉత్తమ…
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2025 : చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ విజేతలను ప్రకటించింది. సినిమా ఇండస్ట్రీల్లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారం అందజేయనున్నారు. మార్చి 19, 2026న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ పురస్కార వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శనివారం జ్యూరీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి అవార్డుల జాబితా ఫైనల్ లిస్ట్ ను అందజేశారు. అనంతరం అవార్డు విన్నర్‌లను ప్రకటించారు. ఈ అవార్డులను ప్రారంభించి రెండో సంవ్సతరమిది. 2025 సంవత్సరానికిగానూ సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభను కనబరచిన నటీనటులు, సాంకేతిక నిపుణులతోపాటు పలు ప్రత్యేక అవార్డులను కూడా ప్రకటించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు మెగాస్టార్ చిరంజీవిని వరించింది. పైడి జయరాజ్ అవార్డు విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ను, బీఎన్ రెడ్డి అవార్డు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును, నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు…
