తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ విజేతలకు ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్ శుభాకాంక్షలు

Film Critics Association congratulates Telangana Gaddar Film Awards winners
Film Critics Association congratulates Telangana Gaddar Film Awards winners
Spread the love

గద్దర్ ఫిలిం అవార్డ్స్ కు సంబంధించిన 2025 సంవత్సరపు విజేత‌ల జాబితా అధికారికంగా ప్రకటించబడింది. ప్రజాగాయకుడు గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా సినీ రంగంలో వివిధ విభాగాల్లో విజేతలుగా ఎన్నికయిన వారందరికీ ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభు గారికి ఉత్తమ పుస్తక రచయితగా గద్దర్‌ అవార్డుకు ఎన్నికవ్వడం ఫిలిం క్రిటిక్స్‌ సభ్యులతో పాటు ప్రతీ సినిమా జర్నలిస్ట్‌ గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ తరుపున ప్రతీ విజేతకు హృదయపూర్వక అభినందనలు.
విజేతలైన
ఉత్తమ నటుడు- నాగ చైతన్య (తండేల్‌)
ఉత్తమ నటి- రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్‌)
ఉత్తమ చిత్రం- రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం- దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం- ది ప్రీ వెడ్డింగ్‌ షో
నేషనల్‌ ఇంటిగ్రిటీ సినిమా- తండేల్‌
ఉత్తమ పర్యావరణ చిత్రం- ఇగ్వా
ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్- లిటిల్‌ హార్డ్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం- సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం- కోర్టు
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ- మిరాయ్‌
ఉత్తమ బాలల చిత్రం- అనగనగనా
ఉత్తమ దర్శకుడు- సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్త‌మ డెబ్యూ ద‌ర్శ‌కుడు- సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్)
ఉత్తమ స‌హాయ‌ నటుడు- శివాజీ
ఉత్తమ స‌హాయ నటి- భూమిక
ఉత్తమ సంగీత దర్శకుడు- మార్క్ కె రాబిన్‌ (దండోరా)
ఉత్తమ నేపథ్య గాయకుడు- అనురాగ్ కుల‌క‌ర్ణి(రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నేపథ్య గాయని- సాహితి చాగంటి (కన్నప్ప)
ఉత్తమ హాస్యనటుడు- కృష్ణ తేజ (జిగ్రీస్‌)
ఉత్తమ బాలనటుడు- రోహన్ రాయ్‌ (ప్రీ వెడ్డింగ్‌ షో)
ఉత్తమ కథా రచయిత- గుణశేఖర్‌ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌- అనిల్‌ రావిపూడి
ఉత్తమ గేయ రచయిత- నందకిశోర్‌ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌- కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)
ఉత్తమ ఎడిటర్‌- శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌)
ఉత్తమ ఆడియోగ్రాఫర్‌- ఎం.ఆర్‌ రాధాకృష్ణన్ (కిష్కిందపురి)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌- గిర గిర గిర (ఛాంపియ‌న్)
ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌- తోట తరణి (ఛాంపియన్‌)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌- చంద్రకాంత్ (ఛాంపియ‌న్)
ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్- 23
ఉత్తమ న‌టుడు స్పెష‌ల్ జ్యూరీ- చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నటి స్పెష‌ల్ జ్యూరీ- అనంతిక (8 వసంతాలు) స్పెషల్‌ జ్యూరీ హీరో- రోషన్ (ఛాంపియన్‌)
ఉత్తమ పుస్తక రచయిత – సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభు తదితరులందరికీ పేరుపేరునా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరపున శుభాకాంక్షలు

ఇట్లు
అధ్యక్షులు
-బత్తుల జెవి ప్రసాద్‌రావు,

జనరల్ సెక్రటరీ
-సురేష్‌ కొండేటి
ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌.