మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రకు ప్రాణం పోసేందుకు రామ్ చరణ్ అద్భుతంగా ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరింత ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ సింగిల్- చికిరి చికిరి ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో, దర్శకుడు బుచ్చి బాబు సానా, అకాడమీ అవార్డు విన్నింగ్ కంపోజర్ ఎ.ఆర్. రెహమాన్ పట్ల తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని పంచుకుంటూ, పాట సందర్భాన్ని వివరిస్తూ…
Month: November 2025
నిర్మాతగా నాకు ఎంతో సంతృప్తిని కలిగించిన సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ : ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్…
కుంభమేళా ఫేమ్ మోనాలిసా కథానాయికగా ‘లైఫ్’ ప్రారంభం
కుంభమేళాలో పూసలమ్ముతూ విశాలమైన కనులతో సోషల్ మీడియా ద్వారా అందరినీ ఆకట్టుకున్న మోనాలిసా తెలుగులో కథానాయికగా మారింది. సాయిచరణ్ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్ బేనర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి లైఫ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. నిర్మాత అంజన్న నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. లైఫ్ సినిమా బుధవారం నాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభమైంది. సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పూజతో లైఫ్ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సురేష్ క్లాప్ కొట్టగా, నిర్మాత డీఎస్ రావ్ కెమెరా స్విచ్చాన్ చేయగా శివన్నారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిర్మాత అంజన్న మాట్లాడుతూ.. ఈరోజు సినిమాను ప్రారంభించాం. అలాగే రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతుంది. సరికొత్త ప్రయోగంగా…
భారత్ డి.ఎమ్.ఎఫ్ డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025 .. భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ ఎక్సలెన్స్ వేడుక
హైదరాబాద్‌లోని హెచ్.ఐ.సి.సి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025 విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కంటెంట్ క్రియేటర్స్, సినిమా రంగం మరియు మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు కొందరు విశిష్ట ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. సినిమాటికా ఎక్స్‌పోతో కలిసి భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం మరియు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం దేశ డిజిటల్ భవిష్యత్తు రూపురేఖలు మార్చబోయే ఎందరో టాలెంటెడ్ క్రియేటర్స్ ను ఒక చోటకు చేర్చింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా, తెలంగాణ ప్రభుత్వ ఐ.అండ్ పి. ఆర్ విభాగం ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక ఐ.ఏ.ఎస్ పాల్గొని విజేతలకు అవార్డులను ప్రదానం చేసి అనంతరం ప్రసంగింస్తూ “డిజిటల్ క్రియేటర్స్ అంటే కేవలం…
