యాక్షన్ కామెడీ కథతో ‘అన్నగారు వస్తారు’ టీజర్

'Annagaru Vastaru' teaser with an action comedy story
'Annagaru Vastaru' teaser with an action comedy story
Spread the love

స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వా వాతియార్’ తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అన్నగారు వస్తారు’ టైటిల్ తో రాబోతోంది. ఈ సినిమా డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ‘అన్నగారు వస్తారు’ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా ‘అన్నగారు వస్తారు’ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉందన్న అనిల్ రావిపూడి.. హీరో కార్తీ, ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా, ఇతర టీమ్ మెంబర్స్ కు తన బెస్ట్ విశెస్ అందించారు. ‘అన్నగారు వస్తారు’ టీజర్ ఎలా ఉందో చూస్తే .. ‘పోలీస్ ఆఫీసర్ గా హీరో కార్తి రాకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటారు స్థానిక ప్రజలు. వారితో కలిసి జోష్ ఫుల్ డ్యాన్స్ స్టెప్స్ తో స్టైలిష్ గా ఎంట్రీ ఇస్తాడు కార్తి. ఈ సెలబ్రేషన్స్ జరుగుతుండగానే, మరోవైపు కృతిశెట్టి, సత్యరాజ్, ఆనంద్ రాజ్, రాజ్ కిరణ్ వంటి కీ రోల్స్ ను పరిచయం చేశారు. హీరో కార్తి చేసిన పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సులతో టీజర్  ఆకట్టుకుంది’. “అన్నగారు వస్తారు” సినిమాలో ప్రేక్షకులు ఎంజాయ్ చేయబోయే యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్ ను టీజర్ చిన్న శాంపిల్ గా చూపించింది.