‘సరస్వతి’ కథ చెప్పడానికి ధైర్యం కావాలి : : ప్రీరిలీజ్ ఈవెంట్ లో శరత్ కుమార్

It takes courage to tell the story of 'Saraswathy' : : Sarath Kumar at the pre-release event
It takes courage to tell the story of 'Saraswathy' : : Sarath Kumar at the pre-release event
Spread the love

వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్  స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం’సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
హీరో శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఇక్కడ విమెన్ పవర్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక నటిగా వరలక్ష్మీ విజయంలో నా పాత్ర ఏమీ లేదు. కాకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని. సరస్వతి లాంటి కథ ఖచ్చితంగా చెప్పాలి.  స్త్రీలని గౌరవించడం మనందరి కర్తవ్యం. పూజకి చాలా మంచి ప్రొడక్షన్స్ స్కిల్స్ ఉన్నాయి. సరస్వతిలో కొన్ని క్లిప్స్ చూశా.ను చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. వరలక్ష్మి పూజ టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఇందులో మంచి టెక్నీషియన్స్ పనిచేశారు. తమన్ గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. అలాగే కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. అంతిమంగా ప్రేక్షకులే నిర్ణయితలు. తప్పకుండా ఈ సినిమాకి వాళ్ళు చాలా మంచి తీర్పు ఇస్తారని నమ్ముతున్నాను.
హీరోయిన్ డైరెక్టర్, వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ వేడుకకి విచ్చేసిన స్వప్న దత్ కి నందిని కి సిమ్రన్ కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  బాలయ్యకి నానికి, అడివి శేష్ కి, సమంతకి,  నయనతారకి, గోపికి, బన్నీ వాస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.   ప్రకాష్ రాజ్,  ప్రియమణి నా విజన్ ని మరో స్థాయికి తీసుకువెళ్లారు. తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఇందులో ప్రతి పాత్ర కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది. మా సినిమాకి వెన్నుముకగా నిలిచిన ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. పూజ ఈ సినిమాని చాలా కంట్రోల్ గా చేసింది. ఈ సినిమాతో మా నాన్నగారి ని గర్వపడేలా చేస్తానని నమ్ముతున్నాను. రాధిక సపోర్ట్ ని మర్చిపోలేను. మా ఆయన నిక్ సపోర్ట్ తోనే ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. స్త్రీలని గౌరవించడం మనందరి కర్తవ్యం. అలాంటి మంచి సందేశం వున్న సినిమా ఇది.  సోషల్ మెసేజ్ తో పాటు ఎంగేజింగ్ గా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా నాకు చాలా గొప్ప ప్రేమ అభిమానాన్ని ఇచ్చారు. నావల్ల ఏమవుతుందో అది మీకు ఈ సినిమా ద్వారా ఇస్తున్నాను. మార్చి 6న తప్పకుండా ఈ సినిమా ధియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నాను.
ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాధిక శరత్ కుమార్, ప్రొడ్యూసర్ స్వప్న దత్, హీరోయిన్ ప్రియమణి, పూజా శరత్ కుమార్ , నికోలాయ్ సచ్‌దేవ్‌, ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి, డైరెక్టర్ బి నందిని రెడ్డి, హీరోయిన్ సిమ్రాన్ , సప్తగిరి మాట్లాడారు.