కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా లాస్ట్ ఇయర్ వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటి మాత్రమే కాదు కోలీవుడ్ లో వచ్చిన క్లాసిక్ సినిమాల్లో కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లోకేష్ కనగరాజ్ బ్రిలియంట్ డైరెక్షన్ ఏంటి అన్నది ‘విక్రమ్’తో చూపించాడు. సరైన హిట్ పడితే కమల్ హాసన్ బాక్సాఫీస్ రేంజ్ ఏంటన్నది ‘విక్రమ్’ చూపించింది. అయితే తాజాగా వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ కూడా వసూళ్లతో అదరగొట్టేస్తుంది. రజనీకాంత్‌కు కూడా జైలర్’ ఒక సూపర్ కమ్ బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అయితే కమర్షియల్ గా విక్రమ్ కలెక్షన్స్ ని జైలర్ దాటేసిందని తెలుస్తున్నా ‘విక్రమ్’ తో పోలిస్తే ‘జైలర్’ చాలా వెనుక ఉంటుందని చెప్పొచ్చు. ‘జైలర్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా తన మార్క్ డైరెక్షన్ తో సూపర్…
Year: 2023
‘చంద్రముఖి 2’కి కీరవాణి సంగీతం!
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అతి కొద్ది మంది సంగీత దర్శకులలో కీరవాణి మాత్రమే నెంబర్ వన్ స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. తెలుగు సంగీత సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి సినిమాలతో దేశ వ్యాప్తంగానే కాకుండా .. ప్రపంచ వ్యాప్తంగాను మంచి క్రేజ్ అందుకున్నారు. ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి తెలుగు జాతి గర్వపడేలా చేశారు. ఎలాంటి పాటనైనా సరే తనదైన శైలిలో కంపోజ్ చేసి ఆకట్టుకునే కీరవాణి మళ్లీ చాలా బిజీగా మారిపోయారు. ప్రస్తుతం కీరవాణి ‘చంద్రముఖి 2’ సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. 2005 లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్ గా తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో కూడా మ్యూజిక్ చాలా ప్రత్యేకంగా ఉండబోతుందట. ఇప్పటికే…
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు జి. ఆదిశేషగిరిరావు జెండాను ఎగురవేశారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సందీప్ ప్రకాష్ ఐ.ఆర్.ఎస్. చీఫ్ కమిషనర్, హీరో శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ కార్య క్రమంలో మొదటగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు జి. ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో వివరిస్తూ ఫౌండర్ మెంబర్స్ ను స్మరించుకున్నారు. ముఖ్య అతిధి సందీప్ ప్రకాష్ , ఫౌండర్ కమిటీ మెంబర్ సినీ నటుడు మాగంటి మురళీమోహన్, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, మాజీ అధ్యక్షుడు కె.ఎస్. రామారావు, డా. కె.ఎల్. నారాయణ, పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడారు. అనంతరం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ దత్తత తీసుకున్న గవర్నమెంట్…
అమరవీర సైనికులకు నివాళే ‘సోల్ ఆఫ్ సత్య’ : సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా నవీన్ విజయకృష్ణ దర్శకత్వంలో రూపొందిన షార్ట్ ఫీచర్ ‘సత్య’. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత దీన్ని నిర్మించారు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ షార్ట్ ఫీచర్ నుంచి సోల్ ఆఫ్ సత్య అనే మ్యూజికల్ షార్ట్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈసందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో… మ్యూజిక్ డైరెక్టర్ శ్రుతి రంజని మాట్లాడుతూ ‘‘సంతోషంలో మాటలు రావటం లేదు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కావాలనుకుంటున్నారని తెలిసి నేను డెమో పంపితే ఈ సాంగ్ షార్ట్ లిస్ట్ అయ్యింది. నవీన్‌గారు ఓ సైనికుడి కథను దీనికి స్క్రిప్ట్‌గా అందంగా మలిచారు. తేజ్, స్వాతి సహా ఎంటైర్ టీమ్‌కి థాంక్స్’’ అన్నారు. దర్శకుడు నవీన్…
‘భగవంత్ కేసరి’పై అప్పుడే దుమారం..హరికృష్ణ ‘స్వామి’కి కాపీ అంటూ విమర్శలు
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ’భగవంత్ కేసరి’ సినిమా అక్టోబర్ 19న విడుదలకు సిద్ధం అవుతోన్న వేళ విమర్శల దాడి జరుగుతోంది. ‘భగవంత్ కేసరి’ నందమూరి హరికృష్ణ నటించిన ’స్వామి’ సినిమాకి అనధికార రీమేక్ అని పుకార్లు వచ్చాయి. దీనికి అనిల్ రావిపూడి దర్శకుడు కాగా, ఇందులో శ్రీలీల, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అయితే శ్రీలీల, బాలకృష్ణకి కూతురుగా వేస్తోంది, అలాగే బాలకృష్ణ ఇందులో ఒక మధ్యవయస్కుడిగా కనిపించనున్నాడు. అతని పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. ఇప్పుడు సాంఫీుక మాధ్యమంలో ఈ సినిమా గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది, ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాతలు ఖండించారు. ఇది రీమేక్ కాదు అని చెప్పారు. ఈ సినిమాకి సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు, అతని షూటింగ్ కూడా అయిపోయింది…
వసూళ్లలో ‘జైలర్’ దూకుడు.. సునీల్ కామెడీపై ప్రేక్షకుల అసహనం!
డ్రగ్స్, స్మగ్లింగ్, పిల్లల అక్రమ రవాణ, టెర్రరిజం.. వంటి సీరియస్ కథలకు డార్క్ కామెడీ జోడించి భిన్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. కెరీర్ ఆరంభంలోనే స్టార్ యాక్టర్స్ తో సినిమాలు చేస్తున్న ఆయన తాజాగా సూపర్ స్టార్ జైలర్ చిత్రంతో భారీ గ్రాండ్ హిట్ ను అందుకున్నారు. ఈ చిత్రం కోలీవుడ్ తో పాడు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ముందు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగులోనూ చిరు ‘భోళాశంకర్’ డిజాస్టర్ అవ్వడం వల్ల మరిన్ని వసూళ్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. అయితే ఈ చిత్రంలో టాప్ కమెడియన్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సునీల్ ఓ పాత్ర పోషించిన సంగతి తెలిసింది. ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు ఓ వర్గం తెలుగు ఆడియెన్స్ కు నచ్చలేదని తెలుస్తోంది. దర్శకుడు నెల్సన్ కుమార్ పై కాస్త ఆగ్రహానికి…
హీరో సూర్య ముంబైకి మకాం మార్చారా?
తమిళ స్టార్ హీరో సూర్య గురించి మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఇటీవల ఆయన ముంబయికి మకాం మార్చాడు అంటూ వస్తున్న వార్తలు మాత్రం ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. కుటుంబంతో సహా సూర్య ముంబయి వెళ్లి పోయాడు అనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలకు సూర్య స్పందించలేదు. కానీ తాజాగా సూర్య ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్నాడు. ఫ్యాన్స్ తో చిట్ చాట్ సందర్భంగా ఈ విషయం ప్రస్థావనకు వచ్చింది. ఒక అభిమాని మాట్లాడుతూ మీరు ముంబయి మకాం మార్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం ఎంత అన్నట్లుగా ప్రశ్నించడం జరిగింది. ఫ్యాన్ ప్రశ్నకు సూర్య స్పందిస్తూ.. ముంబయికి మకాం మార్చినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చాడు. తన ఇద్దరు…
అనిరుధ్ ట్యూన్స్‌పై పెదవి విరుపులు.. పాతపాటల వాసన కొడుతోందని కామెంట్స్!!
ఈ మధ్య కాలంలో తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో కూడా అనిరుధ్ సంగీతం గురించి చర్చ జరుగుతోంది. షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా కోసం అనిరుధ్ కలిసి పని చేస్తున్న నేపథ్యంలో ముందు ముందు స్టార్ మ్యూజిక్ కంపోజర్ గా బాలీవుడ్ లోనిలిచే అవకాశాలు ఉన్నాయని అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. జవాన్ సినిమాలోని మొదటి పాటతో అనిరుధ్ హిందీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. మొదటి పాటతో అలరించిన అనిరుధ్ తాజాగా జవాన్ నుండి రెండవ పాటను విడుదల చేయడం జరిగింది. హిందీ ప్రేక్షకులు ఆ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం అజ్ఞాతవాసి గురించి మాట్లాడుకుంటున్నారు. అనిరుధ్ ట్యూన్ చేసిన జవాన్ రెండో పాటను వింటూ ఉంటే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా గుర్తుకు…
తెలుగు ఇండస్ట్రీతో ఆది పినిశెట్టికి బంధం!
పేరుకు తమిళ హీరోనే అయినా.. తెలుగబ్బాయి కావడంతో ఆది పినిశెట్టికి ఇక్కడ కూడా కాస్త మంచి క్రేజే ఉంది. పైగా చిరు, వెంకీ, బాలయ్య, మోహన్ బాబులకు మరిచిపోలేని హిట్లిచ్చిన రవిరాజా పినిశెట్టి కొడుకు అవడంతో ఇక్కడి ప్రేక్షకులు ఆది సినిమాలను బాగానే ఆదరిస్తారు. దానికి తోడు నటనలో ఆయన ఎంత మేటో నిన్నుకోరి, సరైనోడు, రంగస్థలం వంటి సినిమాలు ఆల్రెడీ ప్రూవ్ చేశాయి. అంతేకాకుండా ఆది ఇండస్ట్రీటోకి ఎంట్రీ ఇచ్చింది కూడా తెలుగు సినిమాతోనే. ఇలా తెలుగు వాళ్లతో ఆదికి ఎనలేని అనుబంధం ఉంది. ఇక ఆది తన నటించిన ప్రతీ సినిమాను తెలుగులోనూ డబ్ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన పార్ట్‌నర్ సినిమాను కూడా తెలుగులో పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్…
ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ.. వచ్చే నెలలో విడుదలకు సిద్దం!
బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ’ఉరి:ది సర్జికల్ స్టైక్ర్’, మసాన్, రాజీ, సంజు, సర్దార్ ఉద్దమ్, జరా హాట్కే జరా బచ్కే వంటి చిత్రాలలో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక విక్కీ నటించిన ఉరి సినిమా తెలుగులో కూడా డబ్ అయి ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్‌గా విక్కీ నేషనల్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. గతేడాది ఈయన ప్రాధాన పాత్రలో నటించిన ’సర్దార్ ఉద్దం’ నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ తాజాగా నటిస్తున్న చిత్రం ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ . తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ సోషల్ విూడియా వేదికగా ప్రకటించారు.…
