నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ’భగవంత్ కేసరి’ సినిమా అక్టోబర్ 19న విడుదలకు సిద్ధం అవుతోన్న వేళ విమర్శల దాడి జరుగుతోంది. ‘భగవంత్ కేసరి’ నందమూరి హరికృష్ణ నటించిన ’స్వామి’ సినిమాకి అనధికార రీమేక్ అని పుకార్లు వచ్చాయి. దీనికి అనిల్ రావిపూడి దర్శకుడు కాగా, ఇందులో శ్రీలీల, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అయితే శ్రీలీల, బాలకృష్ణకి కూతురుగా వేస్తోంది, అలాగే బాలకృష్ణ ఇందులో ఒక మధ్యవయస్కుడిగా కనిపించనున్నాడు. అతని పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. ఇప్పుడు సాంఫీుక మాధ్యమంలో ఈ సినిమా గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది, ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాతలు ఖండించారు. ఇది రీమేక్ కాదు అని చెప్పారు. ఈ సినిమాకి సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు, అతని షూటింగ్ కూడా అయిపోయింది అని అతను, బాలకృష్ణ కలిపి పోజు ఇచ్చిన ఫోటోస్ కూడా పోస్ట్ చేసాడు, అవి కూడా వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా శ్రీలీల వేస్తోంది, అందులో కూడా హరికృష్ణకి ఒక కూతురు, భార్యగా మీనా వేశారు, ఇందులో భార్యగా కాజల్ అగర్వాల్ అని, అలా ఆ సినిమాకి, ఈ సినిమాకి పోలికలు పెడుతూ 2004 లో విడుదలైన హరికృష్ణ సినిమాకి, ఇప్పుడు అతని తమ్ముడు బాలకృష్ణ సినిమాకి ముడి పెట్టారు చాలామంది. దానికి చాలా గట్టిగానే బదులిచ్చారు నిర్మాతలు. ఇది రీమేకా కాదా అన్నదానికి నిర్మాతలు సమాధానం చెపుతూ, ’అసలు నిజం ఏంటి అంటే అక్టోబర్ 19న భారీగా చూస్తారు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని బాలకృష్ణ ని బిగ్ స్క్రీన్స్ మీద చూస్తారు’ అని పోస్ట్ చేశారు.
Related posts
-
వైరల్గా మారిన నటి అనన్య నాగళ్ల వ్యాఖ్యలు.. నెటిజన్ల కామెంట్లకు కౌంటర్!!
Spread the love నటి అనన్యా నాగళ్ల సోషల్ విూడియాలో షేర్ చేసిన ఓ వీడియోకు వస్తోన్న విమర్శలపై ఆమె స్పందించారు. ఎందుకింత... -
Actress Ananya Nagalla’s comments which have gone viral.. Counter to netizens’ comments!!
Spread the love Actress Ananya Nagella has responded to the criticism of a video shared on social... -
సందీప్ కిషన్ హీరోగా ‘మజాకా’
Spread the love ఈ మధ్యన రవితేజ వరుస చిత్రాలు విడుదలైనా ఏదీ సరిగ్గా విజయం సాధించలేదు. ‘ధమాకా’ ఒక్కటే హిట్గా నిలిచి...