వసూళ్లలో ‘జైలర్‌’ దూకుడు.. సునీల్‌ కామెడీపై ప్రేక్షకుల అసహనం!

Aggressiveness of 'Jailer' in collections.. Audience's impatience with Sunil's comedy!
Spread the love

డ్రగ్స్‌, స్మగ్లింగ్‌, పిల్లల అక్రమ రవాణ, టెర్రరిజం.. వంటి సీరియస్‌ కథలకు డార్క్‌ కామెడీ జోడించి భిన్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌. కెరీర్‌ ఆరంభంలోనే స్టార్‌ యాక్టర్స్‌ తో సినిమాలు చేస్తున్న ఆయన తాజాగా సూపర్‌ స్టార్‌ జైలర్‌ చిత్రంతో భారీ గ్రాండ్‌ హిట్‌ ను అందుకున్నారు. ఈ చిత్రం కోలీవుడ్‌ తో పాడు వరల్డ్‌ వైడ్‌ గా బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగులోనూ చిరు ‘భోళాశంకర్‌’ డిజాస్టర్‌ అవ్వడం వల్ల మరిన్ని వసూళ్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. అయితే ఈ చిత్రంలో టాప్‌ కమెడియన్‌ అండ్‌ వెర్సటైల్‌ యాక్టర్‌ సునీల్‌ ఓ పాత్ర పోషించిన సంగతి తెలిసింది. ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు ఓ వర్గం తెలుగు ఆడియెన్స్‌ కు నచ్చలేదని తెలుస్తోంది. దర్శకుడు నెల్సన్‌ కుమార్‌ పై కాస్త ఆగ్రహానికి గురి చేసింది. ఈ చిత్రంలో సునీల్‌ ను ఓ డంబ్‌ తెలుగు హీరోగా చూపించారట. అలాగే మాకింగ్‌ తెలుగు స్టార్స్‌ మైండ్‌ లెస్‌ మసాలా ఫిల్మ్స్‌ చేస్తున్నట్లుగా సబ్‌ టైటిల్స్‌ వచ్చాయట. సినిమా సెకండాఫ్‌ లో సునీల్‌ డంబ్‌ (చెముడు) కామెడీ కాస్త ఎక్కువగా ఉంది. ఇదంతా చూసిన తెలుగు సినీ ప్రియులు దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ పై కాస్త మండి పడుతున్నారు. తెలుగు స్టార్స్‌ ను ఇలా ఎందుకు చూపించావంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది సైరన విధానం కాదని సూచిస్తున్నారు. ఇకపై తెలుగు మార్కెట్‌ ను దృష్టిలో పెట్టుకుని సినిమా చేసేటప్పుడు ఎలాంటి పాత్రలు క్రియేట్‌ చేయాలో నేర్చుకోమని అంటున్నారు. ఇకపై ఇలాంటి చెత్త పాత్రలు సృష్టిస్తే ఊరుకునేదే లేదని స్మాల్‌ హింట్‌ అండ్‌ వార్నింగ్‌ ఇస్తున్నారు. అయితే ఈ స్మాల్‌ కాంట్రవర్సీ పెద్దగా హైలైట్‌ అవ్వలేదు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ పై ఎఫెక్ట్‌ చూపలేదు. కానీ ఏది ఏమైనా ఇకపై తెలుగు హీరోలు, యాక్టర్ల గురించి పాత్రలను తీర్చిదిద్దే తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా వహించడం మంచిది. ఎందుకంటే ఆయనకు ఈ సినిమా అవకాశాలు అంత ఈజీగా రాలేదు. ఎన్నో విమర్శలను కూడా అందుకున్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తొలి సినిమా వేటై మన్నన్‌ ఆదిలోనే మొదలై ఆగిపోయింది. ఆ తర్వాత నయనతారతో తీసిన కొలమావు కోకిల, వరుణ్‌ డాక్టర్‌ సినిమాలు కష్టాలను ఎదుర్కొన్న మంచి హిట్‌ గా నిలిచాయి. కానీ ఆ తర్వాత విజయ్‌ దళపతితో తీసిన బీస్ట్‌ మిశ్రమ స్పందనలను అందుకుంది. ఇప్పుడు ‘జైలర్‌’ విషయంలోనూ ఆయన ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.

Related posts

Leave a Comment