మార్చి 4న విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ విడుదల

Ashokavanamlo arjuna kalyanam Movie relese march 4th

ఫలక్నుమాదాస్ నుంచి పాగల్ వరకు వైవిధ్యమైన కథా చిత్రాలతో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 4న ఈ చిత్రం విడుదలవుతుంది. మంగళ వారం ఈ సినిమా నుంచి ‘సిన్నవాడా ..’ అనే పాట విడుదలైంది. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిలో తెలియని ఓ గందరగోళం, చిన్నపాటి ఆతృత ఉంటాయి. వాటిని గురించి ప్రస్తావించేలా ‘సిన్నవాడా..’ సాంగ్ ఉంది. జానపదంలో సాగేలా పాట ఉండటంతో పాట వింటుంటే డిఫరెంట్గా అనిపిస్తూ ఆకట్టుకుంటోంది. జై క్రిష్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలోని సిన్నవాడా పాటకు అనన్య భట్, గౌతమ్ భరద్వాజ్ తమ గొంతుకలతో ఓ కొత్తదనాన్ని అందించారు.…

తెలంగాణ రాష్ట్ర రెఫరీ టెస్ట్!

kabaddi test

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఈ నెల ఫిబ్రవరి 20 (ఆదివారం) తేదీన ఉదయం 11 గంటలకు ఎగ్జామ్ నిర్వహించబడును కావున తెలంగాణ జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ లో పాల్గొనవచ్చు Note: అర్హతలు: కనీసం టెన్త్ పాస్ అయి ఉండాలి లేదా వృత్తి విద్యా కోర్సులు (D.PEd,BPEd,MPEd,PhD,..in physical education) ప్రవేశము ఉండాలి EXAM fee 500.Rs ఇట్లు పూల నాగయ్య కార్యదర్శి యాదాద్రి భువనగిరి కబడ్డీ అసోసియేషన్ Cell 9848387964

సెన్సేష‌న‌ల్ డైర‌క్ట‌ర్ వీవీ వినాయక్ క్లాప్ తో ‘ఓసీ’షూటింగ్ ప్రారంభం!!

osee movie opening

కౌండిన్య ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై కిర‌ణ్ లోవ, ల‌క్ష్మి కిర‌ణ్‌, హ‌రీష్ బొంపల్లి, మంజీర ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందుతోన్న చిత్రం `ఓసీ`. కిర‌ణ్ & విష్ణు ద‌ర్శ‌కులు. విష్ణు శ‌ర‌ణ్ బొంప‌ల్లి నిర్మాత‌. ఈ రోజు ఈ చిత్ర ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెన్సేష‌న‌ల్ డైర‌క్ట‌ర్ వీవీ వినాయ‌క్ ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా ముని రాజ్ గుత్తా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స‌త్య మాస్ట‌ర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా హీరో, ద‌ర్శ‌కుడు కిర‌ణ్ లోవ మాట్లాడుతూ…“ నేను న‌టిస్తూ, ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు వీవీ వినాయ‌క్ గారు వ‌చ్చి క్లాప్ కొట్ట‌డం మా తొలి స‌క్సెస్ గా భావిస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు నేను తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి హీరోగా 18…

జర్నలిస్టుల శ్రమ వెలకట్టలేనిది: HUJ డైరీ ఆవిష్కరణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

huj dairy relese

వార్తల సేకరణ కోసం నిద్దరహారాలు మాని రాత్రి పగలు విధులు నిర్వహించే జర్నలిస్టుల శ్రమ వెలకట్టలేనిదని కేంద్ర పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్ లో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్.యు.జె) మీడియా డైరీ – 2022ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా విపత్తు నుండి ప్రజలను అప్రమత్తం చేయడానికి, ధైర్యాన్ని అందించడానికి జర్నలిస్టులు ప్రాణాలను ఫణంగా పెట్టి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారని కొనియాడారు. కరోనా సమయంలో ఎందరో జర్నలిస్టులు ప్రాణాలను సైతం కోల్పోవడం తీరని విషాదమన్నారు. ముఖ్యంగా ఎలాంటి జీత భత్యాలు లేకుండా మీడియా సంస్థల్లో వెట్టిచాకిరి చేస్తున్న స్ట్రింగర్ల బతుకులు దీనస్థితిలో ఉన్నాయని, కనీసం భార్యాపిల్లలకు కడుపునిండా తిండి అందించలేక పోతున్నారని కిషన్ రెడ్డి విచారం…

A concept based billingual (Tamil-Telugu) Album Directed by Upcoming Director Vivek Kaipa Pattabiram has been cpmpleted and ready to release.

A concept based billingual (Tamil-Telugu) Album Directed by Upcoming Director Vivek Kaipa Pattabiram has been cpmpleted and ready to release.

A concept based billingual (Tamil-Telugu) Album Directed by Upcoming Director Vivek Kaipa Pattabiram has been cpmpleted and ready to release. Director vivek has worked previously in tamil-telugu movies and Many big Television Commercials and also worked as reality producer for tv shows. The song was shot in Goa & Chennai in Different Excotic locations. Young Telugu heart throb Viswant dudumpudi who has done manamantha,kerintha,tholubomalata is the hero in this conept song . Produced by giant music and Music by Subhash anand sung by Chinmayee sripada, Haricharan and Yazin nizar .…

జన్మదినోత్సవాలు మధురమైన స్మృతులు : ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు పూల నాగయ్య

జన్మదినోత్సవాలు మధురమైన స్మృతులు : ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు పూల నాగయ్య

ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుంది అన్నది ఎంత నిజమో ఒక మంచి స్నేహితుడు కూడా జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తాడన్నది అంతే నిజం. అలాంటి నా జీవితంలో స్నేహితుల పాత్ర మరపురానిది అన్నారు ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు పూల నాగయ్య. జె.ఎం.జె వ్యాయామ ఉపాధ్యాయులుగా తునికి రవికుమార్ మంచి మనసున్న వ్యక్తి అని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఫ్రెండ్స్ క్లబ్ లో జె.ఎం.జె వ్యాయామ ఉపాధ్యాయులు తునికి రవికుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో పూల నాగయ్య మాట్లాడుతూ … ప్రతి ఒక్కరి జీవితంలో జన్మదినోత్సవాలు మధురమైన స్మృతులని పేర్కొంటూ ఆ దిశగా వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పుట్టిన రోజుని ఎవరికి వారు తమ జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన రోజుగా భావిస్తారు.…

వినోదమే ప్రధానంగా చిత్రాలను నిర్మిస్తాం : సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ అధినేత, నిర్మాత సిరిసాల యాదగిరి

sirisala productions

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వస్తున్న సినిమాలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయని, మంచి చిత్రాల నిర్మాణం జరిగితే పరిశ్రమ కళకళలాడుతుందని ఎల్.బి.నగర్ ఏసీపీ పి. శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో జరిగిన సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉత్తమ చిత్రాల నిర్మాణమే ధ్యేయంగా సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత సిరిసాల యాదగిరి మాట్లాడుతూ .. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉత్తమ విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రాలను నిర్మించాలన్న లక్ష్యంతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టామని, ఆ దిశగా చక్కటి చిత్రాలను నిర్మించి మంచి పేరు తెచ్చుకుంటామన్నగట్టి నమ్మకం మాకు ఉందని…

‘న‌ల్ల‌మ‌ల’ ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. సినిమా స‌క్సెస్ కావాలని కోరుకుంటున్నా: దిల్ రాజు

nallamala movie

అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం న‌ల్ల‌మ‌ల‌. ఈ చిత్రం ద్వారా రవి చరణ్ ‌దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథిగా పాల్గొని న‌ల్ల‌మ‌ల ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘అందరూ కొత్త వాళ్లు కలిసి ఇలా కొత్త సినిమాలు తీస్తున్నారు. మామూలుగానే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ. ఇలా కొత్త వాళ్లంతా కలిసి వస్తుంటే మరింత తక్కువగా ఉంటుంది. ఎంత మంది సక్సెస్ అవుతున్నారో గమనించి సినిమాలు తీయండని నా వద్దకు వచ్చే వారికి చెబుతాను. కొత్తగా చేసే వాళ్లని ప్రోత్సహించాలని నాకు ఉంటుంది. అలా…

గోపీచంద్-శ్రీ‌వాస్ హ్యాట్రిక్ మూవీలో కీల‌క‌పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు

jagapathibabu

ల‌క్ష్యం, లౌక్యం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల త‌ర్వాత హీరో గోపీచంద్ – ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే.. గోపీచంద్‌ కెరీర్‌లో 30వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీని పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రానికి కో-ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విభిన్నమైన జానర్‌ సినిమాలతో, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించే సంస్థగా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ హీరో గోపీచంద్‌తో చేస్తున్న తొలి చిత్రం ఇది. ఈ మూవీలో ఒక కీల‌క పాత్ర‌లో విల‌క్ష‌ణ‌ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టించనున్నారు. ఈ రోజు జ‌గ‌ప‌తిబాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ల‌క్ష్యం త‌ర్వాత గోపిచంద్‌, శ్రీ‌వాస్‌, జ‌గ‌ప‌తిబాబు ల స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్ర‌మిది.…

“డిజె టిల్లు” విజయం కొత్త వాళ్లను మరింత ప్రోత్సహించే ధైర్యాన్నిచ్చింది : నిర్మాత సూర్యదేవర నాగవంశీ

DJ Tillu's success has motivated us to introduce younger talents into the industry: Producer Suryadevara Naga Vamsi

డిజె టిల్లు సీక్వెల్ సినిమా సిద్ధుతోనే త్వరలో… సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డిజె టిల్లు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘డిజె టిల్లు’ విడుదల అయిన అన్ని కేంద్రాలలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తమ విజయానందాన్ని మీడియాతో పంచుకున్నారు చిత్ర నిర్మాత, హీరో, దర్శకుడు. అదేమిటో వారి మాటల్లోనే…. హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ…నేను ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్ అనే మాట వినలేదు. ఇప్పుడు డిజె టిల్లుతో వింటున్నా. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇవాళ తెలిసింది. చాలా…