మోడలింగ్ రంగంలో ఎదగాలన్న కల, మిస్టర్ ఇండియా, మిస్ ఇండియా, మిసెస్ ఇండియా అవ్వాలన్న లక్ష్యం మీలో ఉందా అయితే మీకోసం మేమున్నాం అంటూ అవకాశాలు అందించేందుకు రెడీ అయింది వింగ్స్ మోడల్ హబ్. ఇప్పటివరకు కేవలం హైద్రాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమం ఈసారి పాన్ ఇండియా లెవెల్లో ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల వారితో ఈ మిస్టర్ అండ్ మిస్ ఇండియా కాంపిటీషన్ నిర్వహించి ఫైనల్ గా హైద్రాబాద్ లో జరిగే గ్రాండ్ ఫినాలే లో విజేతను ప్రకటిస్తారు. ఈ సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ పోస్టర్ లాంచ్ కార్యక్రమం మంగళవారం హైద్రాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హీరోయిన్ చాందిని, జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, కిరాక్ ఆర్పీ, మహేష్, కృతిక మిస్సెస్ ఇండియా 2018,…
Year: 2022
కరీంనగర్ టు రాజమండ్రి వయా లండన్: ‘టీ-3’తో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు!!
కప్పుకు రూపాయి మాత్రమే మార్జిన్ రుచి-నాణ్యత-సంతృప్తిలకు ప్రధమ ప్రాధాన్యం!! *** “టీ” ప్రియుల మనసులు హోల్ సేల్ గా దోచుకుంటున్న కరీంనగర్ కుర్రాడు “కిరణ్ బైరెడ్డి” అతను పుట్టింది దిగువ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలోనే అయినా…. అతని ఆలోచనలు మాత్రం అత్యున్నత శ్రేణికి చెందినవి. డిగ్రీ వరకు కరీంనగర్ లో చదివి…. విజయవాడలో “ఐ.సి.డబ్యూ.ఎ.ఐ” చేసి… లండన్ లో “ఎమ్.బి.ఎ” పట్టా పుచ్చుకుని… అక్కడ నాలుగన్నరేళ్లు కొన్ని కొలువులు చేసినా అతనికి కోరిన సంతృప్తి దొరకలేదు. “ఇక ఇక్కడ పొడిచింది చాల్లే” అని సొంతూరు వచ్చేశాడు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అతని అర్ధాంగి కూడా అందుకు అభ్యంతరం చెప్పలేదు. “నీ మెంటాలిటీకి మోనోటనీగా ఉండే ఉద్యోగాలు సరిపడవులే” అంటూ ఫుల్ సపోర్ట్ చేసింది. లండన్ లో ఉండగా పరిచయం అయిన మిత్రుడి ఆహ్వానం మేరకు ఒకపరి…
ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న ‘సామాన్యుడు’కు మంచి ఆదరణ
విశాల్ యాక్షన్ థ్రిల్లర్ “సామాన్యుడు” కు తమిళంలో కంటే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ZEE5 అనేది వివిధ రకాల వినోద ఫార్మాట్‌లను అందించే ఏకైక వేదిక. వినోదాత్మక సినిమాలు, వెబ్ సిరీస్‌లు డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ ‘జీ`5 ఓటీటీ’ అంటే ‘వినోదం మాత్రమే కాదు, అంతకు మించి’ అన్నట్లు దూసుకు పోతోంది.ZEE5 ప్రతి నెలా సినిమాలు మరియు ఒరిజినల్‌లను విడుదల చేస్తోంది.అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరికళ్లూ తనవైపు తిప్పుకుంటోంది. ZEE5 యాప్ ద్వారా మొబైల్, టాబ్లెట్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌పై కేవలం ఒక క్లిక్ చేస్తే ఫుల్ ఏంటర్ టైన్మెంట్స్ అందిస్తుంది. తమిళంలో ‘వీరమే వాగై సూదుం’ పేరుతో విశాల్…
‘Saamanyudu’ streams on ZEE5
Vishal’s action thriller is a bigger hit with Telugu viewers than in Tamil Hyderabad, 14th March, 2022: ZEE5 is the one platform that brings out a variety of entertainment formats: web series, direct-to-digital releases, original movies, digital releases. It has been dishing out content for the entertainment of worldwide viewership in various languages: from Hindi to Telugu, Tamil, Kannada, Malayalam, Marathi, Bengali to Gujarati. ZEE5 is just a click away on a mobile, tablet, desktop, laptop. In recent weeks, we have seen movies like Nagarjuna-Naga Chaitanya’s ‘Bangarraju’ being released on…
సల్మాన్‌ఖాన్‌కి వెల్కమ్ చెప్పిన చిరంజీవి
టాలీవుడ్ లో మరో సంచలనానికి తెరలేచింది. ఇద్దరు అగ్రనటులు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు .’గాడ్‌ఫాదర్’ చిత్రం దీనికి వేదిక కానుంది. మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి .’గాడ్‌ఫాదర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మీ రాక ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది. ఉత్సాహాన్ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. మీతో స్క్రీన్‌ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ ప్రజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు’ అంటూ సల్మాన్‌కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు చిరంజీవి. ప్రస్తుతం వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.…
‘గం.. గం.. గణేశా’ పోస్టర్ విడుదల
సినిమాలో ఏదో కొత్తదనం ఉండాలని కోరుకునే యువ హీరో ఆనంద్ దేవరకొండ. అన్న విజయ్ దేవరకొండ ఇమేజ్ కు, మూవీ ఛాయిస్ లకు భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక దారి ఏర్పర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన “దొరసాని”, “మిడిల్ క్లాస్ మెలొడీస్”, “పుష్పక విమానం” చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ ఉత్సాహంలో వరుస చిత్రాలు చేస్తున్నారు. అందులో “గం.. గం.. గణేశా” ఓ డిఫరెంట్ ఫిల్మ్ కాబోతోంది. మంగళవారం ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా “గం..గం..గణేశా” చిత్రం నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆనంద్ టైటిల్ పేరు గణేష్ అని పోస్టర్ ద్వాారా తెలుస్తోంది. మన గణేష్ గాడి స్వాగే సెపరేటు అంటూ రిలీజ్ చేసిన ఫొటో స్కెచ్ లో పగిలిన కళ్లద్దాలు, తలకు బ్యాండేజ్ చూస్తుంటే గణేష్ యాక్షన్…
ఆనంద్ దేవరకొండ `హైవే` కొత్త పోస్టర్ ఇదే!
యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా `హైవే`. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత వెంకట్ తలారి. ఇవాళ ఆనంద్ దేవరకొండ సందర్భంగా `హైవే`చిత్రం నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. హిల్ స్టేషన్ లో ఈ యువహీరో టూర్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఉందీ పోస్టర్. కొండ రాయిపై కూర్చుని చుట్టూ అందమైన నేచర్ ను చూస్తున్నారు. ఈ పోస్టర్ ద్వారా ఆనంద్ కు బర్త్ డే విశెస్ చెప్పింది చిత్ర యూనిట్ కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన చిత్రాలు చేస్తున్న ఆనంద్ కు…
సినిమాల్లో తెలుగు చచ్చిపోతుంది!
తేనెకన్నా తీయనిది -తెలుగు భాష. ఈ భాషలో కవిత రాసినా.. పద్యం చెప్పినా.. సామెత పలికినా.. -అపురూపమే. తెలుగు సినీ దర్శక నిర్మాతలు వారికున్న అమోఘమైన పాండిత్యంతో అద్భుతమైన కథలను వైవిధ్యంగా తెరపై పండించారు. తెలుగు మాటల, పాటల రచయితలు తమ మేథో సంపత్తితో అద్భుతమైన విన్యాసాలు, సరళమైన పదాలతో గంభీరమైన అర్థాలను విపులీకరించి ప్రేక్షకులను సమ్మోహనపరిచారు. అలా సృజించిన మాటల, పాటల గొప్పదనాన్ని తెలుగు నటులు తెరపై ఆవిష్కరించి ‘ఇదీ తెలుగు సినిమా’ అనే స్థాయికి తీసుకెళ్లారు. అలా -తెలుగు సినిమా షడ్ర సోపేత విందు భోజనమైంది. చల్లని వెన్నెల, సందెలోని గోధూళి, మట్టిపరిమళం, గోరింటాకు ఎర్రదనం.. వీటికి మించిన తెలుగుదనాన్ని -సినిమా నుంచీ ప్రేక్షకుడు అందుకున్నాడు. తెలుగు పాట పాడుకుంటే ఆనందం. చక్కని డైలాగు చెప్పుకుంటే ఉత్సాహం. ఇలా తెలుగుదీపిని ప్రతి ప్రేక్షకుడికీ పంచిన…
ఇండస్ట్రీ బాధ్యత మరచిపోతోందా!?
ఫ్రెష్ ఫీల్‌ని కోరుకోవడం ఆడియన్స్ నైజం. ఎప్పటికీ ఫ్రెష్ ఫీల్‌నిచ్చే సినిమాలివ్వడం ఇండస్ట్రీ బాధ్యత. ఈ రెంటి విషయాల్లో తెలుగు ఇండస్ట్రీ ఒక్కడుగూ ముందుకు వేయలేదు. ఇండస్ట్రీ బాధ్యత మరచిపోతోందా!? అనిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు, పాన్ ఇండియా పటాటోపాలు.. ఇవన్నీ పరిశ్రమను పదికాలాలు పరిగెత్తించే బలాన్నిచ్చేవైతే కాదు. అంటే, మంచి సినిమాలే రాలేదా? అన్న ప్రశ్న చటుక్కున బుర్రకు తట్టొచ్చు. ఆ ప్రశ్నకు సమాధానంగా కొన్ని చిత్రాలను ఉదహరించొచ్చు. అవన్నీ కథాబలం, కథనగమనం చూపించిన చిత్రాలుగానే చూడగలం తప్ప, స్టార్లు పెంచుకున్న చిత్రాలుగా అభివర్ణించలేం. స్ట్రెయిట్‌గా చెప్పాలంటే ‘బావున్న’ సినిమాలొచ్చాయే తప్ప, ‘చాలా బావుంది’, ‘చాలా చాలా బావుంది’ అనదగ్గ సినిమాలైతే లేవనే చెప్పాలి. బావున్న సినిమాలొచ్చాయి. అలాంటి సినిమాలను పక్షపాతం లేకుండా ఆడియన్స్ ఆదరించారు. దేశాలు దాటొచ్చిన కథలను ఆదరించారు.…
ఘనంగా ప్రారంభమైన ‘సత్య ఫిల్మ్ ఇన్స్ట్యూట్’
సినిమాలో నటించాలంటే డైలాగ్స్, డ్యాన్స్ ఉంటే సరిపోదు వీటికి తోడు యాక్టింగ్, ఫైటింగ్ ఇలా ఎన్నో రకాల మెళుకువల్లో శిక్షణ పొందాలి.అలాంటి వారికోసం అన్నీ ఒకే చోట శిక్షణ ఇచ్చేలా సరికోత్త ఇన్స్ట్యూట్ మనముందుకు వచ్చింది.డ్యాన్సర్ గా కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న సత్య మాస్టర్ ఇంతకు ముందు సత్య ఫిలిం స్టూడియో, సత్య డి.జోన్స్ ఇన్స్టిట్యూట్ లు పెట్టి ఎంతో మందికి డ్యాన్స్ లో శిక్షణ ఇచ్చి వందల మంది డాన్సర్స్ ను తయారు చేసి టీవీ రంగానికి, సినిమా రంగానికి పరిచయం చేయడం జరిగింది. అయితే ఒక్క డ్యాన్స్ కే పరిమితం కాకుండా ట్యాలెంట్ ఉన్న యువతీ, యువకులకు నటనతో పాటు అన్నీ రకాల శిక్షణ ఇచ్చి పరిపూర్ణ నటులను తయారు చెయలనే ఉద్దేశ్యం తో సత్య ఫిల్మ్ అకాడమీ” ప్రారంభోత్సవం సినీ,…
