వాషింగ్టన్ తెలుగు సమితి అంతర్జాతీయ తెలుగు కవితల పోటీకి శ్రీకారం చుట్టింది. “పడమటిసంధ్యారాగం” పేరిట “అమెరికాతో భారతీయుల అనుబంధం” అనే అంశంతో వచన కవితలను ఆహ్వానిస్తోంది. భారతదేశం మాతృభూమిగా గల ఎందరో భారతీయులు అమెరికాని తమ పితృభూమిగా భావిస్తారు. అమెరికాకి వలసలని కోరుకుంటారు. రెండు సంస్కృతులమధ్య వారధి కడతారు. ఈ నేపథ్యంలో తెలుగువారి మనసులో అమెరికా స్థానం ఏమిటి? అన్న విషయంపై వచన కవితలను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదలజేసింది వాషింగ్టన్ తెలుగు సమితి. పాల్గొనే వారికి నియమాలు, సూచనలు, కవితలు పంపవలసిన చిరునామా మొదలైనవి ప్రకటనలో పొందుపరించారు. ఈ కవితా మహోత్సవానికి అధ్యక్షత శ్రీ షకీల్ బాషా, నిర్వహణ శ్రీ జయపాల్ రెడ్డి దొడ్డ, సంచాలకత్వం శ్రీ మధు రెడ్డి మరియు పర్యవేక్షణ శ్రీ శ్రీనివాస్ అబ్బూరి, ఉపాధ్యక్షులు. న్యాయనిర్ణేతల నివేదిక అనంతరం సుప్రసిద్ధ సినీకవుల సమక్షంలో తొలి పది స్థానాల్లో నిలిచిన కవయిత్రీ కవులచే కవితా సమ్మేళనం మరియు బహుమతుల ప్రకటన ఉండబోతోంది.
వాషింగ్టన్ తెలుగు సమితి: అంతర్జాతీయ తెలుగు కవితల పోటీ
