”కెరీర్‌లోనూ, లైఫ్‌లోనూ ఎంతో ఎత్తుకి ఎదగాలని నా ఆశ. ఇది సాధిస్తే చాలు అనుకోను. అన్నీ సాధించాలనుకుంటాను. నాకు నేను హద్దులు పెట్టుకోను. బాలీవుడ్ సినిమాలు చేయాలి. హాలీవుడ్ సినిమాలు చేయాలి. ఆ కలలే నన్ను ఇంకా కష్టపడేలా చేస్తాయి. ప్రస్తుతం బుడిబుడి అడుగులే వేస్తున్నా. కానీ నా కలలను చేరుకుంటానన్న నమ్మకం నాకుంది” అంటోంది లావణ్యా త్రిపాఠి. “నా దారిలో ఏది ఎదురొచ్చినా నవ్వుతూ పలకరించడమే నాకు అలవాటు. అది మంచైనా, చెడైనా సరే. నవ్వుతూనే పలకరిస్తాను’’ అని చెబుతోంది. ‘‘ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు ఇబ్బందుల్లో పడుతూనే ఉంటారు. కొంతమందికి ఆ రోజు బావుండకపోవచ్చు. ఆ బాధలో నా దగ్గరికొస్తే అవన్నీ మర్చిపోయేలా చేయాలనుకుంటాను. నా నవ్వు మంత్రమేసి కాసేపైనా వాళ్లను సంతోషంగా ఉండేలా చేయాలనుకుంటాను. అందరితో దయగా ఉండాలి. దానికోసం ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదు. బాధల్లో ఉన్నవారికి ఊరట కలిగించేలా సౌమ్యంగా మాట్లాడితే చాలు. అంతే.. అందువల్ల మన సంపాదన ఏమీ తరిగిపోదు’’ అని అంటోంది. ఓహో.. లావణ్యా త్రిపాఠి స్ఫూర్తి మంత్రం ఇదేనన్నమాట.
లావణ్యా త్రిపాఠి స్ఫూర్తి మంత్రం ఇదే!
