టీఆర్ఎస్ అరాచకాలకు ఇక ముగింపు:
టీపీసీసీ అధికార ప్రతినిధి, మీడియా కో-ఆర్డినేటర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి
- టాలీవుడ్ టైమ్స్ న్యూస్ -హైదరాబాద్
టీపీసీసీ సారధి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు వస్తాయని టీపీసీసీ అధికార ప్రతినిధి, మీడియా కో- ఆర్డినేటర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏడేళ్లుగా కేసీఆర్ కుటుంబ అరాచకం, ఇటు ఆలేరు నియోజకవర్గంలో గొంగిడి సునీత, మహేందర్ రెడ్డి దంపతుల భూ ఆక్రమణలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి నిర్దేశకత్వంలో గొంగిడి దంపతుల అరాచకాలమీద అన్ని వేదికల మీద పోరాడుతామన్నారు. ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు నడుస్తూ, పార్టీ శ్రేయస్సు లక్ష్యంగా పని చేస్తా అని అయోధ్య రెడ్డి చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయిన గొంగిడి కుటుంబం ఆస్తులు పెంచుకోవడము తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచులను వేధిస్తున్నారని ఆరోపించారు. గొంగిడి దంపతుల కోరల్లో Nచిక్కిన ఆలేరు నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని అయోధ్య రెడ్డి కోరారు.