రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూన్ 17న థియేటర్లలో విడుదల

Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty Releasing On June 17th
Spread the love

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతోన్న యునీక్ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ` మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. శరత్ మండవ దర్శకుని గా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ LLP, RT టీమ్ వర్క్స్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా విడుదల తేదీ ని ప్రకటించారు. రామారావు ఆన్ డ్యూటీ జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ల లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ రోజు మేకర్స్ రవితేజ తీక్షణంగా చూస్తోన్న లుక్ను విడుదల చేశారు. ఇందులో కొన్ని భారీ రవాణా వాహనాలు అడవి గుండా వెళుతుండడాన్ని ఆయన గమనిస్తున్నారు.
ఈ పోస్టర్ ఆసక్తిని క్రియేట్ చేయడమేకాకుండా, సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. రాబోయే రోజుల్లో మరింత హైప్ క్రియేట్ చేసేలా మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్లతో రాబోతున్నారు..
సామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ సంగీతంతోపాటు బాణీలు మరింత ఆకట్టుకోనున్నాయి.
యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు, వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీతో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సత్యన్ సూర్యన్ ISC నిర్వహిస్తుండగా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్.
నటీనటులు: రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్ప్లే, మాటలు & దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్ LLP, RT టీమ్ వర్క్స్
సంగీత దర్శకుడు: సామ్ సిఎస్
DOP: సత్యన్ సూర్యన్ ISC
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
PRO: వంశీ-శేఖర్

Related posts

Leave a Comment