రష్మిక “బాలీవుడ్ కి సూట్” అయ్యే భామ కాదనే ఇంప్రెషన్ ఉంది. టాలీవుడ్ లో ఇప్పుడు ఎవ్వరి నోటా విన్నా ఇదేమాట. రష్మిక బాలీవుడ్ బాట పట్టడం ఒక విధంగా చెప్పాలంటే పెద్ద సర్ప్రైజ్. ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా రష్మిక బాలీవుడ్ ఆలోచనలు లేవని చెప్పింది. మరి సడెన్ గా ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా సరసన “మిషన్ మజ్ను” అనే సినిమా ఎలా ఒప్పుకొంది? అని అంటున్నారంతా! సినిమా కథ ప్రకారం సౌత్ ఇండియన్ భామ కావాలి అట. దాంతో పలువురు హీరోయిన్ల పేర్లని షార్ట్ లిస్ట్ చేస్తున్నప్పుడు… రష్మిక బెస్ట్ ఛాయస్ అని ఆ సినిమా డైరెక్టర్ కి అందరూ చెప్పారట. “సరిలేరు నీకెవ్వరు”, “గీత గోవిందం” సినిమాలు చూసిన తర్వాత దర్శకుడు కూడా రష్మిక కరెక్ట్ గా ఉంటుంది అని భావించాడట. రష్మిక కూడా వెంటనే అంగీకరించింది. ఎందుకంటే… బాలీవుడ్ మూవీ చేస్తే తనకి కూడా పాన్ ఇండియా మార్కెట్ పెరుగుతుంది. యాడ్సు బాగా వస్తాయి. అందుకే, వెంటనే సైన్ చేసిందట. ఆమె లెక్కలు ఆమెవి. మార్కెట్ పెంచుకోవడమే ఆమె లక్ష్యం. ఇప్పటికే మాతృ భాష కన్నడంలో నటించింది. తమిళ్ లో కూడా అడుగుపెట్టింది. ఆమె నటించిన మొదటి తమిళ చిత్రం కార్తీ సరసన “సుల్తాన్”. తెలుగులో ఆల్రెడీ టాప్ హీరోయిన్. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అంతో, ఇంతో పేరు వస్తే… ఆమెకి పాన్ ఇండియా మార్కెట్ పెరుగుతుంది. అదీ ఆమె లెక్కట. రష్మిక పుట్టింది పెరిగింది… కొడగు ప్రాంతంలో. కర్ణాటకలోని హిల్ స్టేషన్ లలో ఒకటి అది. అక్కడి కల్చర్, ఆహారపు అలవాట్లు… మిగతా కర్ణాటక ప్రాంతానికి డిఫరెంట్ గా ఉంటాయి. ఎక్కువగా బ్రిటిష్ వారి పాలనా ముద్రలు ఇంకా మిగిలే ఉంటాయి. కాఫీ తోటలతో నిండి ఉండే ఈ ప్రాంతానికి చెందిన రష్మిక …తన ఆహారపు అలవాట్ల గురించి తాజాగా బయటపెట్టింది. “మేము రెగ్యులర్ గా పోర్కు (పంది మాంసం) తింటాం. అలాగే రెడ్ వైన్ తీసుకుంటాం. హెల్త్ కి మంచిది,” అన్నట్లుగా చెప్పింది. ఐతే, ఇవి తన అభిరుచులు అని చెప్పలేదు…తమ ప్రాంతపు కల్చర్ గురించి చెప్పింది. కానీ రష్మికని మన తెలుగోళ్లు ట్రోల్ చేస్తున్నారు. ఐతే, రష్మిక అవేవి పట్టించుకోవట్లేదు. దటీజ్ రష్మిక!
పాన్ ఇండియా మార్కెట్ పై రష్మిక దృష్టి!?
![pan india market pai rashmika drusti](https://tollywoodtimes.in/wp-content/uploads/2021/06/Rashmika3.jpg)