T-Times News- ALER
ఆలేరు, జనవరి 9: యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఆదివారం సాయంకాలం వడ్డెమాన్ నరేందర్ జన్మదిన వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు పూల నాగయ్య కేక్ కట్ చేసి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బి జె పి జిల్లా కార్యదర్శి తునికి దశరథ, తునికి చంద్రశేఖర్, తునికి రవికుమార్, ఆర్.తునికి గణేష్, ఆలేటి చంద్రమౌళి పాల్గొన్నారు ఈ సందర్బంగా ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు పూల నాగయ్య తన శుభాకాంక్షలను అందజేస్తూ.. వడ్డెమాన్ నరేందర్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నరేందర్ కు ఆ భగవంతుడు అన్ని విధాలా అష్టఐశ్వర్యాలు ఇవ్వాలని ఆకాంక్షించారు.