ఆమంచి జగదీశ్వర్,
విశ్రాంత ప్రధానోపాధ్యాయులు
సూర్యాపేట. cell: 9177858436
కనిపెంచిన చైనానే
కనిపించని శత్రువోలే కబలించేగదా
కనుగొను ప్రక్రియ చేయన్
వినిపించెను మరణగంట విశ్వంబెల్లన్
మరణాల మహమ్మారిగా
కరుణయే లేని పగతో కరిచెడి రీతిన్
వీరులు నెందరినైనను
బోరున విలపింపజేయ జోరుగ సాగెన్
అంతట ఇంతట తానై
ఎంతటి దేశ్జంబునైన ఎదురించుటలో
శుంతైన జాలి చూపక
ఇంతింతై విశ్వమెల్ల విజృంభించెన్