నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. అయితే 2021లో ఒక తెలుగు చిత్రానికి ఈ తరహా కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి అని అంటున్నారు. అమెరికాలో ఈ చిత్రం హాఫ్ మిలియన్ (500K+) డాలర్స్ మార్క్‌ని సంపాదించుకుందిట. ఇదే జోరు కొనసాగితే ఈ వీకెండ్ వరకూ వన్ మిలియన్ మార్క్ చేరుకోవడం గ్యారంటీ అని చెబుతున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఓవర్సీస్‌లో ‘అఖండ’ ప్రభంజనం!
