మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి గారి పుట్టిన రోజు జనవరి 29 . చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కోవిడ్ బారిన పడక తప్పలేదంటూ ఆయన ఇటీవల ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు మెడిసిన్ వాడుతున్నారు. అయితే..ప్రతి ఏడాది తల్లి జన్మదిన వేడకను దగ్గర ఉండి ఘనంగా జరిపించే చిరంజీవి.. కరోనా కారణంగా ఈ ఏడాది ప్రత్యేక్షంగా తల్లిని కలుసుకోలేకపోయారు. దీంతో సోషల్ మీడియా ద్వారా తల్లికి బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ‘‘అమ్మా.. జన్మదిన శుభాకాంక్షలు. హోంక్వారంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలియజేస్తున్నా..నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని మనసారా కోరుకొంటూ అభినందనలతో …. శంకరబాబు” అంటూ ట్వీట్ చేస్తూ భార్య సురేఖ, తల్లి అంజనా దేవిలతో కలిసిఉన్న ఫోటోని షేర్ చేశారు మెగాస్టార్ . కాగా.. అంజనా దేవి చిరంజీవిని ముద్దుగా శంకర్ బాబు అని పిలుస్తారు.
అమ్మా..జన్మదిన శుభాకాంక్షలు : చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
