ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం థియేటర్లలోకి రావడంతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు థియేటర్ల బాట పట్టారు. అదే విధంగా ఓ అభిమాని కూడా ఎన్టీఆర్ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లాడు. సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేశాడు. ఈలలు, కేకలు వేస్తూ సందడి చేస్తూ ఒక్కసారి కూప్పకూలిపోయాడు. అనుహ్యంగా ఒక్కసారిగా జరిగిన ఓ ఘటనతో థియోటర్లోని ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. నగరంలోని అప్సర థియేటర్‌లో ‘దేవర’ చిత్రం విడుదల సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. సినిమా చూస్తున్న క్రమంలో ఓ అభిమాని కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడు సీకే దీన్నే మండలం జమాల్ పల్లికి చెందిన మస్తాన్ వలిగా గుర్తించారు. ఎంతో ఉత్సాహంగా తమ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాను చూసేందుకు వచ్చిన అభిమాని ఇలా హఠాన్మరణం చెందడం అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది. మస్తాన్ వలి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Related posts
-
Sankranthi Vasthunam movie Review: Decent family entertainer!
Spread the love (Movie: Sankranthiki Yaaam, Release: 14 January -2025, Rating: 3.75/5, Actors: Venkatesh, Meenakshi Chowdhury, Aishwarya... -
టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి
Spread the love సమగ్ర మీడియా సమాచారంతో, దాదాపు నలభై యేండ్లుగా ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర... -
శ్రీకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ‘వారధి’ మూవీ సెన్సార్ పూర్తి
Spread the love తెలుగు తెరపైకి మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతుంది. రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై, పెయ్యాల భారతి,...