డైరెక్టర్‌కు అస్వస్థత… రకుల్‌ హిందీ షూటింగ్‌ రద్దు!

The director is ill... Rakul's Hindi shooting is cancelled!
The director is ill... Rakul's Hindi shooting is cancelled!
Spread the love

‘కెరటం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పింది ఢిల్లీ భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. హీరోయిన్‌గా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి బ్రేక్‌ అందుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ వన్‌ ఆఫ్‌ ది లీడింగ్ హీరోయిన్‌గా కొనసాగిన ఈ భామ తెలుగు సినిమాలో కనిపించక చాలా కాలమే అవుతుంది. ప్రస్తుతం హిందీ ప్రాజెక్టులపైనే ఫోకస్‌ పెట్టింది. ఈ భామ అజయ్‌ దేవ్‌గన్‌, టబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘దే దే ప్యార్‌ దే 2’లో ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ
చిత్ర షూటింగ్‌ కొన్ని రోజులుగా పాటియాలో జరుగుతుంది. అయితే అనుకోకుండా సినిమా షూటింగ్‌ రద్దయినట్టు ఓ వార్త బయటకు వచ్చింది. తాజా టాక్‌ ప్రకారం మూడీ డైరెక్టర్‌ అన్షుల్‌ శర్మ అస్వస్థతకు లోనవడంతో రెండు రోజుల పాటు చిత్రీకరణ నిలిపేసినట్టు తెలుస్తోంది. అన్షుల్‌ వర్మ డెంగ్యూ అని నిర్దారణ కాగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని బీటౌన్‌ సర్కిల్‌ సమాచారం. అన్షుల్‌ శర్మ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సినిమా మరో నెలపాటు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ‘దే దే ప్యార్‌ దే 2’ షూటింగ్‌ మళ్లీ నవంబర్‌లో మొదలు కానున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వన్‌ ఆఫ్‌ ది ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోన్న ఇండియన్‌ 3 పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది.