Home MOVIE REVIEWS FILM NEWS బాలీవుడ్ అశ్లీలతపై కఠిన నియంత్రణ అవసరమే : కంగనా రనౌత్

బాలీవుడ్ అశ్లీలతపై కఠిన నియంత్రణ అవసరమే : కంగనా రనౌత్

0
బాలీవుడ్ అశ్లీలతపై కఠిన నియంత్రణ అవసరమే :  కంగనా రనౌత్
Strict control over Bollywood pornography is needed: Kangana Ranaut
Spread the love

బాలీవుడ్ తన స్థాయిని దిగజార్చుకుంటూ, ప్రేక్షకులను ఆకర్షించడం కోసం అన్ని హద్దులను దాటేస్తోందని స్టార్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఘాటుగా విమర్శించారు. చౌకబారు ట్రిక్కులతో అశ్లీలతను ప్రోత్సహిస్తున్న సినీ పరిశ్రమ తీరును దేశమంతా ఛీకొడుతున్నా, వారికి ఏమాత్రం సిగ్గు ఉన్నట్లు అనిపించడం లేదని ఆమె మండిపడ్డారు. ఇలాంటి అభ్యంతరకర ప్రదర్శనలకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వం బాలీవుడ్‌పై కచ్చితంగా కఠినమైన నియంత్రణ విధించాలని, అప్పుడే ఈ అశ్లీలతకు ఎండ్ కార్డ్ పడుతుందని కంగనా గట్టిగా నొక్కి చెప్పారు. అసలు ఈ వివాదం ‘కేడీ.. ది డెవిల్’ అనే కన్నడ చిత్రం కోసం రూపొందించిన హిందీ పాటతో మొదలైంది. ఈ పాటలోని సాహిత్యం పచ్చిగా, డబుల్ మీనింగ్ డైలాగులతో ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. కేవలం సాధారణ ప్రజలే కాకుండా, ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ కూడా కమర్షియల్ సాంగ్ రైటింగ్ ఇంతగా దిగజారిపోవడం బాధాకరమంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో నోరా ఫతేహి నటించిన ఈ పాటను ఇప్పటికే యూట్యూబ్ నుంచి తొలగించారు. అంతేకాకుండా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని చిత్ర బృందానికి నోటీసులు జారీ చేయడం గమనార్హం.