నాకు కత్రీనాకైఫ్ కు ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం : సల్మాన్‌ ఖాన్‌

This Diwali is very special for Katrina Kaif: Salman Khan
This Diwali is very special for Katrina Kaif: Salman Khan
Spread the love

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా పలు చిత్రాల్లో నటించి, ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ జోడీగా పేరుని సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఏదీ కూడా దీపావళికి ఇప్పటి వరకు రిలీజ్‌ కాలేదు. తొలిసారి ఈ జోడీ నటించిన ‘టైగర్‌ 3’ దీపావళికి సందడి చేయనుంది. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. దీపావళికి ఈ సినిమా విడుదల కాబోతోన్న నేపథ్యాన్ని పురస్కరించుకుని సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. దీపావళి పండుగకి సినిమా రిలీజ్‌ కావటం అనేది ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆరోజుల్లో విడుదలయ్యే చిత్రాలను ప్రేక్షకుల ఆస్వాదించటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలా దీపావళి రోజున విడుదలైన నా చిత్రాలు తీపి గుర్తులుగా మిగిలిపోయాయి. అయితే నాకు, కత్రినాకు ఈ దీపావళి పండుగ మరెంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇప్పటి వరకు మేం కలిసి నటించిన ఏ సినిమా కూడా దీపావళికి రిలీజ్‌ కాలేదు. తొలిసారి ‘టైగర్‌ 3’ రిలీజ్‌ కానుంది. కాబట్టి మేం ఎంతో ఆనందంతో, ఆసక్తికరంగానూ ఎదురు చూస్తున్నాం. దీపావళి అంటే వ్యక్తులే కాదు, కుటుంబాలు కూడా ఒక చోటికి చేరుతాయి. నాకు కావాల్సిన వారితో దీపావళి పండుగను సెలబ్రేట్‌ చేసుకోవటానికి నేను ఇష్టపడతాను. అలాగే నా కుటుంబ సభ్యులందరితో కలిసి ‘టైగర్‌ 3’ సినిమాను చూస్తాను. అందరూ ఈ సినిమాను బిగ్‌ స్క్రీన్‌పై చూసి అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌ని పొందుతారని భావిస్తున్నానని అన్నారు.