చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్‌కు పునరావృత దోషం ఉండదు. ఎన్నిసార్లు చూసినా చూడముచ్చటగా అనిపిస్తాయి. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీ ఒకటి. ‘గీత గోవిందం’ సినిమాలో తొలిసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాతో ఈ పెయిర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన ఎఫెక్ట్‌తో వీరిద్దరూ మళ్లీ కలిసి ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేశారు. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయినా.. వీళ్ల కెమెస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. అయితే అన్స్క్రీన్లో ఎంత సరదాగా ఉంటారో ఆఫ్ స్క్రీన్‌లోనూ వీళ్లు చాలా సరదాగా జోకులు వేసుకుంటూ ఉంటారు. అయితే గతకొంత కాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్ళి కూడా చేసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు వీరిద్దరూ కలిసి ఒకే లోకేషన్లో దిగిన ఫోటోలను వేర్వేరుగా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చుతున్నారు. అయితే రీసెంట్గా ఈ వార్తలలో ఎలాంటి నిజాలు లేవన్నట్లు రష్మిక ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ దేవరకొండ తన ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకోగా.. ఈ వేడుకలకు రష్మిక వచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. విజయ్ ఫ్యామిలీ ఉన్న ఇంటి లోకేషన్‌కు.. రష్మిక ఉన్న లోకేషన్ మ్యాచ్ అవుతుంది…!
Related posts
-
వైరల్‌గా మారిన నటి అనన్య నాగళ్ల వ్యాఖ్యలు.. నెటిజన్ల కామెంట్లకు కౌంటర్!!
Spread the love నటి అనన్యా నాగళ్ల సోషల్ విూడియాలో షేర్ చేసిన ఓ వీడియోకు వస్తోన్న విమర్శలపై ఆమె స్పందించారు. ఎందుకింత... -
Actress Ananya Nagalla’s comments which have gone viral.. Counter to netizens’ comments!!
Spread the love Actress Ananya Nagella has responded to the criticism of a video shared on social... -
సందీప్ కిషన్ హీరోగా ‘మజాకా’
Spread the love ఈ మధ్యన రవితేజ వరుస చిత్రాలు విడుదలైనా ఏదీ సరిగ్గా విజయం సాధించలేదు. ‘ధమాకా’ ఒక్కటే హిట్‌గా నిలిచి...