‘వెయ్ దరువెయ్’ చిత్రం నుంచి ‘వెయ్ దరువెయ్ ‘ లిరికల్ సాంగ్ విడుదల చేసిన హీరో నాగ చైతన్య

Hero Naga Chaitanya has released title song "Vey Daruvey" Lyrical Song from the film "Veydaruvey".
Hero Naga Chaitanya has released title song "Vey Daruvey" Lyrical Song from the film "Veydaruvey".
Spread the love

నాగ చైతన్య గారు మాట్లాడుతూ ఈ పాట చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది, సినిమా చూడాలి అని కూతుహలాన్ని రేపుతుంది, సినిమా ఖచ్చితంగా ఈ సినిమా తెలుగులో సక్సెస్ అవ్వాలని.. మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.సినిమా లో పని చేసిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పారు.
హీరో సాయి రామ్ శంకర్ గారు మాట్లాడుతూ నాగచైతన్య గారి చేతుల మీదుగా రిలీజ్ చేయటం చాల ఆనందంగా ఉంది మా సినిమా నుంచి ఇది రెండవ సాంగ్ మొదటి సాంగ్ మంజుల మంజుల సాంగ్ అయిదు మిల్లియన్ వ్యూస్ కి రీచ్ అయింది. చాల మంచి విశేష స్పందన వచ్చింది రెండవ సాంగ్ టైటిల్ సాంగ్ ఇది మా మూవీ నుంచి మా సినిమాకి బెస్ట్ డాన్స్ నెంబర్ సాంగ్ మీకు తప్పకుండ నచ్చుతుంది అని మరొక సారి మా ప్రొడ్యూసర్ గారికి , ఈ సాంగ్ రిలీజ్ చేసిన చైతన్య గారు థాంక్స్ చెప్తూకుంటున్నాను
దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ ” ఈ పాట విడుదల చేసిన అక్కినేని నాగచైతన్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదలు , ఈ సినిమా కథ చెప్పగానే సింగిల్ సిట్టింగ్ లో ఒప్పుకున్నారు మా హీరో సాయి గారు , ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని జయించాను అనే అనుకుంటున్నాను ” అని అన్నారు. నా నా మీద నమ్మకం తో ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి కూడా థాంక్స్ చెప్తున్నాను.
ప్రొడ్యూసర్ దేవరాజ్ గారు మాట్లాడుతూ ” నవీన్ గారు నాకు కథ చెప్పగానే ఎంతో నచ్చింది , ఎంత ఖర్చు అయిన సరే నేను పెడతాను అని కథ మీద నమ్మకం తో ముందుకు వచ్చాను , మేము అనుకున్నట్టే చాలా బాగా వచ్చింది సినిమా , హీరో గారి కెరీర్ లో మరొక మంచి సినిమా అవుతుంది అని మేమంతా గట్టిగా నమ్ముతున్నాం” అని అన్నారు ఈ సినిమా ఫిబ్రవరి 24th రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకొని ఫిబ్రవరి లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ . హీరో సాయి రామ్ శంకర్ , హీరోయిన్ యాశ శివ కుమార్ , సునీల్ , కాశి విశ్వనాథ్ , పోసాని కృష్ణ మురళి , పృథ్వి , తదితరులు నటిస్తున్నారు .
డైరెక్టర్ : నవీన్ రెడ్డి ,
ప్రొడ్యూసర్ : దేవరాజు పొత్తూరు
మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్
కెమెరా మెన్ : ముత్యాల సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :జనగాని కార్తీక్ , శ్రీపాల్ చొల్లేటి,

Video link