ఏప్రిల్‌ 25న ‘సోదరా’ చిత్రం విడుదల నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ ను కలిసిన సోదరా టీం

The Sodara team met the Telangana Governor ahead of the release of the film 'Sodara' on April 25th.
Spread the love

క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సంపూర్ణేష్‌ బాబు మరియు సంజోష్‌ హీరోలు గా, బాబు మోహన్, ప్రాచీబంసాల్, ఆర్తి గుప్తా ప్రధాన పాత్రలో మోహన్‌ మేనం పల్లి దర్శకత్వంలో చంద్ర చాగండ్ల నిర్మిస్తున్న అన్నదమ్ముల అనుబంధ కుటుంబ కథ చిత్రం “సోదరా”. ఈ చిత్రం అని  కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. కాగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మగారిని సంపూర్ణేష్ బాబు, సంజోష్, దర్శకుడు మోహన్‌ మేనం పల్లి మరియు ఇతర సోదర టీమ్ సభ్యులు ఇటీవల గౌరవప్రదంగా కలిశారు. వారిని కలిసి సోదరా చిత్ర విశేషాలు తెలియజేసి “ఏప్రిల్ 25న మా సోదరా చిత్రం విడుదల అవుతుంది, మా చిత్రాన్ని తప్పక చూడాలి” అని విన్నపించుకున్నారు యూనిట్ సభ్యులు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మగారు చిత్ర కథ విన్నీ “ఇలాంటి పల్లెటూరి కుటుంబ కథలు, అన్నదమ్ముల విలువలు ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులకి అందించాలి, ఇలాంటి చిత్రాలు మంచి విజయం సాధించాలి అని కొనియాడారు. ఆయన సోదరా చిత్రాన్ని తప్పక చూస్తాను” అని భరోసా ఇచ్చారు.
సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆర్తి గుప్తా, బాబా భాస్కర్, బాబు మోహన్, గెటప్ శీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ మరియు దర్శకత్వం:  మోహన్ మేనంపల్లి, నిర్మాణ సంస్థ: క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్
ప్రొడ్యూసర్: చంద్ర చాగండ్ల, సంగీతం: సునీల్ కశ్య ప్, డిఓపి: జాన్, ఎడిటర్: శివశర్వాణి, లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ మరియు పూర్ణ చారి, పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను , మడూరి మధు

Related posts

Leave a Comment