సీరియల్ థ్రిల్లర్స్‌కి, సైకో కిల్లర్ వెబ్‌సీరీస్‌లకి మంచి డిమాండ్ ఉన్న టైమ్ ఇది. లాక్డౌన్లో మొదలైన ఈ ఫీవర్, సిరీస్ లవర్స్‌లో ఇంకా తగ్గలేదు. అలాంటివారికి డబుల్ థ్రిల్లింగ్ కలిగించనుంది ‘పులి మేక’. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘పులి మేక’ ట్రైలర్లోనూ అదే స్పీడ్ కనిపిస్తోంది. స్టార్టింగ్ టు ఎండింగ్ రేసీ నెరేషన్ సిరీస్ మీద స్పెషల్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒకటైన జీ 5 తమ ఆడియెన్స్ కోసం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ సహా ఇతర భాషల్లో అపరిమితమైన, కొత్తదైన, వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తోంది. ఈ ఓటీటీ లైబ్రరీలో ఫిబ్రవరి 24న మరో బెస్ట్ ఒరిజినల్‌గా జాయిన్ కావటానికి సిద్ధమవుతుంది ‘పులి మేక’. ఈ ఒరిజినల్ కోసం జీ…
