ఆర్ఆర్ఆర్ మళ్లీ వాయిదా పడిందా..?

s s rajamouli RRR movie malli vaedha padindha>
s s rajamouli RRR movie malli vaedha padindha>
Spread the love

బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ భారీ పాన్ ఇండియా మూవీని భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మూవీ ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడింది. ఈసారి మాత్రం దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల పక్కా అంటూ రాజమౌళి రిలీజ్ డేట్ ప్రకటించారు. రాజమౌళి అంత నమ్మకంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ.. దసరాకి ఆర్ఆర్ఆర్ రావడం అనుమానమే అంటూ వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఆ అనుమానమే నిజం కానుందని తెలిసింది. అవును.. ఆర్ఆర్ఆర్ మళ్లీ వాయిదా పడనుందని సమాచారం. రాజమౌళి ఉక్రెయిన్ లో పాట చిత్రీకరణ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయనున్నారు. ఆతర్వాత కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని తెలిసింది. అయితే.. అక్టోబర్ కు రిలీజ్ వాయిదా పడితే సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వచ్చింది. సంక్రాంతికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, ప్రభాస్ రాధేశ్యామ్, మహేష్ బాబు సర్కారు వారి పాట. సినిమాలను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.
ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి వస్తే.. సంక్రాంతి సినిమాలు డిస్టర్బ్ అవుతాయి. అందుచేత సంక్రాంతి సినిమాలను డిస్టర్బ్ చేయనని రాజమౌళి మాట ఇచ్చారని తెలిసింది. అందుచేత ఆర్ఆర్ఆర్ సినిమాను క్రిస్మస్ కానీ.. రిపబ్లిక్ డే కి కానీ విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. మరి.. ఈసారైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుందని ఆశిద్దాం.