‘సీతారామం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మరాఠీ సోయగం మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ అవకాశాలను దక్కించుకుంటున్నది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో నాని, విజయ్ దేవరకొండ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీపై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అరవింద్ తాజాగా సైమా వేడుకలో మృణాల్ ఠాకూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో లావణ్య త్రిపాఠిను హైదరాబాద్‌కు వచ్చేయమ్మా అని దీవిస్తే తాను తెలుగింటి కోడలు అయిందని, ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ను కూడా అలాగే దీవిస్తున్నానని అరవింద్ తెలిపారు. దాంతో మృణాల్ ఎవరైనా తెలుగు హీరోతో ప్రేమలో ఉన్నారా..? అని పలువరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం…