దసరా విడుదలలో బీభత్సమైన హైప్‌తో వచ్చిన సినిమా ‘లియో’. విడుదలకు ముందు నుంచి ఈ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా ఎలా తెరకెక్కిందా? అన్న క్యూరియాసిటీతోనే సగం జనాలు థియేటర్‌లకు వెళ్లారు. ఇక నిన్న భారీ అంచనాల మధ్య రిలీజైన ‘లియో’ సినిమా అందరి అంచనాలను అందుకోవడంలో తడబడింది. ఖైదీ, విక్రమ్ సినిమాల రేంజ్‌లో ఉంటుందన్న ఆశతో థియేటర్‌లకు వెళ్లిన ప్రేక్షకులను లియో ఫుల్‌గా సాటీస్‌ఫై చేయలేకపోయింది. అయితే యాక్షన్ సీన్లు మాత్రం హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయని, లోకేష్ మార్క్ కొన్ని చోట్ల మాత్రం మిస్సయిందని పలువురు చెబుతున్నారు. అయితే టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ ప్రవాహం మాత్రం ఆగడం లేదు. తొలిరోజుతో పోల్చితే కాస్త తగ్గాయి కానీ.. ఫర్వాలేదనిపించే కలెక్షన్‌లే వస్తున్నాయి. ఇక తెలుగులోనూ ఈ సినిమా జోరు…