ఈశ్వర్ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు వెండితెరకు పరిచయమైన హను కోట్ల. తొలి చిత్రంలో మూగ పాత్రలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత తన నటనను మరింత మెరుగుపరచుకోవాలనుకున్నారు. అలాగే దర్శకత్వ శాఖలో కూడా తన ప్రతిభను చూపించాలనుకున్నాడు..కానీ అప్పటికే హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉద్యోగరీత్యా బి.ఎ యాక్టింగ్, ఎం.ఎ. మీడియా డైరెక్షన్ కోర్సుల్లో విద్యార్థులకు బోధనా ఉపాధ్యాయుడిగా కొనసాగటం వల్ల ఈశ్వర్ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ తగిన పాత్ర కోసం ఎదురుచూశారు.. ఇప్పుడు ‘ది డీల్’ అనే సినిమా ద్వారా హీరో గా పరిచయం కాబోతున్నాడు. ఆధునిక తెలుగు నాటక రంగంలో నటుడిగా, దర్శకుడి గా అనేక ప్రయాణాలు చేసి రంగస్థలం పై ఎన్నో విజువల్ వండర్స్ ని క్రెయేట్…