‘సౌండ్ పార్టీ’ టీజ‌ర్ విడుదల

'Sound Party' Teaser Released

బిగ్ బాస్ తెలుగు 5 టైటిల్ విన్న‌ర్ వీజే స‌న్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, ప్రొడక్షన్ నెంబ‌ర్-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ. హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని సెప్టెంబ‌ర్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో డైర‌క్ట‌ర్ సంప‌త్ నంది చేతుల మీదుగా `సౌండ్ పార్టీ` టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సంప‌త్ నంది మాట్లాడుతూ…“నేను కూడా గ‌తంలో కొన్ని చిత్రాల‌కు స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రించాను. అదే బాట‌లో జ‌య‌శంక‌ర్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హరిస్తున్నాడు. ఈ ట్రెడిష‌న్ ని ఇలాగే కొన‌సాగించాల‌ని కోరుకుంటున్నా.…