సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా నవీన్ విజయకృష్ణ దర్శకత్వంలో రూపొందిన షార్ట్ ఫీచర్ ‘సత్య’. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత దీన్ని నిర్మించారు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ షార్ట్ ఫీచర్ నుంచి సోల్ ఆఫ్ సత్య అనే మ్యూజికల్ షార్ట్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈసందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో… మ్యూజిక్ డైరెక్టర్ శ్రుతి రంజని మాట్లాడుతూ ‘‘సంతోషంలో మాటలు రావటం లేదు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కావాలనుకుంటున్నారని తెలిసి నేను డెమో పంపితే ఈ సాంగ్ షార్ట్ లిస్ట్ అయ్యింది. నవీన్‌గారు ఓ సైనికుడి కథను దీనికి స్క్రిప్ట్‌గా అందంగా మలిచారు. తేజ్, స్వాతి సహా ఎంటైర్ టీమ్‌కి థాంక్స్’’ అన్నారు. దర్శకుడు నవీన్…