ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ హీరోగా షర్మిళ కంచి సమర్పణలో డి.ఎల్. ఎంటర్టైన్మెంట్స్, ఆర్.కె. క్రియేటివ్ వర్క్స్ పతాకాలపై రామకృష్ణ కంచి రచన, దర్శకత్వంలో తోట రంగారావు, పున్నపు రజనీకాంత్ నిర్మించిన డార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘షార్ట్‌కట్’. విజయానికి అడ్డదారులు లేవు అనేది ట్యాగ్‌లైన్. సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్రం షో రీల్, పోస్టర్ విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో శివాజీ విచ్చేశారు. అలాగే బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌తో పాటు, కంటెస్ట్‌లు, మల్కాజ్గిరి ఏసీపీ విచ్చేశారు. ఈ సందర్భంగా హీరో శివాజీ మాట్లాడుతూ… సందీప్ మంచి ఆటగాడు. బయట డాన్స్‌మాస్టర్‌గానే కాదఱు.. బిగ్‌బాస్‌లో కూడా బాగా ఆడాడు. మంచి వ్యక్తి. నాకు సందీప్ చిన్నతనం నుంచి తెలుసు. కష్టపడటం అంటే ఇష్టపడే వ్యక్తి.…