‘జవాన్’ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించనున్న సినిమా ‘డంకీ’. రాజ్ కుమార్ హిరాణీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో షారుఖ్ ఖాన్ సరసన తాప్సీ పన్ను నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటి అయిన ఈ సినిమా ఇప్పటికే సగా నికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీపావళి కానుకగా షారుఖ్ డంకీ సినిమా టీజర్ ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. దీపావళికి విడుదల కానున్న సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై 3’ (టైగర్ త్రీ)తో పాటు డంకీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం.…